SHOCKING NEWS : ఇకపై “వాట్సాప్” ఫ్రీ కాదంట..? 1.2 బిలియన్ మంది యూస్ చేస్తుండగా..!

0
14

మార్కెట్లో రకరకాల స్మార్ట్ ఫోన్లు..అందులో రకరకాల యాప్ లు..వాటిల్లో రకరకాల ఫీచర్లు..ఈ ప్రపంచం మొత్తం కళ్లముందున్నట్టు ఫీల్ అయితాం..  ఎక్కువమంది వాడుతున్న యాప్స్ లో ఫేస్ బుక్,వాట్సప్ ముందుంటాయి.వాడుతున్న జనాలకు తగ్గట్టుగా వాట్సప్ కూడా ఎన్నో రకాల ఫీచర్ల ను అందుబాటులోకి తెచ్చింది..ఉదయం లేవగానే గుడ్ మార్నింగ్ మొదలుకొని,రాత్రి పడుకునేప్పుడు గుడ్ నైట్ వరకు..పండగొచ్చినా ఏం విశేషమైనా ప్రతిదానికి స్నేహితులకు,బంధువులకు విష్ చేయడానికి  వాట్సప్ వాడుతూనే ఉంటాం..ఇంతవరకు ఫ్రీగా వాడిన వాట్సప్ కు ఇకపై డబ్బులు చెల్లించాలట.

ప్రపంచవ్యాప్తంగా సుమారు 1.2 బిలియన్‌ యూజర్లు వాట్సప్ వాడుతున్నారు. ఈ స్టార్టప్‌కు ఉన్న క్రేజ్‌ను దృష్టిలో పెట్టుకుని ఫేస్‌బుక్‌ యాజమాన్యం 2014లోనే వాట్సప్ ను కొనుక్కుంది. అయితే ఇప్పటివరకు వాట్సప్ ను ఫ్రీ గానే మనం వాడాం కానీ  భవిష్యత్ లో ఎంతో కొంత ఛార్జీ వసూలు చేయాలనే ఆలోచనలో ఉన్నారనే  వార్తలు హల్ చల్ చేస్తున్నాయి. వాట్సప్ బిజినెస్ టూల్ తోపాటు.. రెగ్యులర్ యాప్ కి ఛార్జీ విధించాలనే ఆలోచనలో ఉన్నట్లు బిజినెస్ పత్రికల్లో కథనాలు వచ్చాయి.కొత్తగా వ్యాపారవేత్తల కోసం ఈ యాప్‌లో బిజినెస్‌ టూల్‌ను ఏర్పాటు చేశారు. ఈ టూల్‌ను వినియోగించాలనుకుంటే సొమ్ము చెల్లించాల్సిందే. ఈ మొబైల్‌ బిజినెస్‌ టూల్‌ టెస్టింగ్‌ పొజిషన్‌లో ఉంది. ఇదిపూర్తయ్యాక.. చిరు వ్యాపారులకు మొదట్లో ఉచితంగా అందించాలన్న ఆలోచన ఉందని వాట్సప్‌ అధికారులు తెలిపారు. మన దేశంలో ఇప్పటికే ఈ టెస్టింగ్‌ దశలో ఉన్న ఈ టూల్‌ని బుక్‌మైషో ఉపయోగిస్తోంది. టెస్టింగ్ పూర్తయిన తర్వాత.. వ్యాపారుల నుంచి ఈ సర్వీస్ కు ఛార్జ్ వసూలు చేస్తారు.

అయితే మొదట్లో వాట్సప్ ఏడాది మాత్రమే ఫ్రీ అని ఆ తర్వాత సంవత్సరానికి ఇంత చొప్పున సర్వీస్ ఛార్జి పే చేయాలనే వార్త ఒకటి ప్రచారం అయింది..కానీ అది జరగలేదు..మరిప్పుడు ఇది ఎంతవరకు అమలవుతుందో..ఒకవేళ అమలయితే ఎంత సర్వీస్ ఛార్జ్ చేస్తారు…….

LEAVE A REPLY