రంగారెడ్డి జిల్లాలో 5.5 డిగ్రీల ఉష్ణోగ్రత

రంగారెడ్డి జిల్లాలో 5.5 డిగ్రీలు, వికారాబాద్‌లో 5.5 డిగ్రీలు, సంగారెడ్డిలో 5 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. రాత్రి సమయంలో చలి నుండి ఉపశమనం పొందేందుకు ప్రజలు చలిమంటలు వేసుకుంటున్నారు.

తుది దశకు చేరిన మనోహరాబాద్- గజ్వేల్ మార్గం పనులు

మార్చి 31నాటికి మనోహరాబాద్- గజ్వేల్ మధ్య ట్రయల్ రన్ నిర్వహించేందుకు అధికారులు సిద్ధమవుతున్నారు. ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గం కావడంతో రైల్వేశాఖ కూడా మొదటి దశ పనులపై ప్రత్యేక దృష్టి...

రాజ్‌భవన్‌లో ప్రమాణం చేయించిన గవర్నర్ నరసింహన్

తెలంగాణ హైకోర్టు చీఫ్ జస్టిస్‌గా నియామకమైన తొట్టతిల్ భాస్కరన్ నాయర్ రాధాకృష్ణన్ మంగళవారం రాజ్‌భవన్‌లో ప్రమాణం స్వీకరించారు. అనంతరం హైకోర్టులో 12 మంది జడ్జీలు ప్రమాణం చేశారు. రాజ్‌భవన్‌లో ఉదయం 8.30 గంటలకు...

పంచాయతీ ఎన్నికల అబ్జర్వర్లుగా 26 మంది సీనియర్ ఐఏఎస్‌లు

పంచాయతీ ఎన్నికలను పకడ్బందీగా నిర్వహించేందుకు 26 మంది సీనియర్ ఐఏఎస్‌లకు బాధ్యతలు అప్పగించినట్టు రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నాగిరెడ్డి తెలిపారు. నోటిఫికేషన్ జారీ అయినప్పటి నుంచి ఎన్నికల ప్రక్రియ ముగిసే వరకు వీరు...

అసెంబ్లీ ఓటరు జాబితా అనుసరించి..

అసెంబ్లీ ఓటరు జాబితాను అనుసరించి పంచాయతీ ఎన్నికల ఓటరు జాబితా తయారుచేశామని, సప్లిమెంటరీ జాబితాను విడుదలచేశామని ఎన్నికల కమిషనర్ తెలిపారు. మే నెలలో సిద్ధం చేసిన ఓటర్ల జాబితా ప్రకారం గ్రామీణ ప్రాంతంలో...

సరిపడా బ్యాలెట్ పత్రాలు

గత ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని ఈసారి మొత్తం 3,36,34,279 బ్యాలెట్ పేపర్లు ముద్రించామని, అదనంగా మరో 20 శాతం (92,223) అందుబాటులో ఉంచుతామని తెలిపారు. తెలుగు అక్షరమాల ప్రకారం అభ్యర్థులకు గుర్తులు కేటాయిస్తామని...

పక్కాగా ప్రచార ఖర్చు లెక్కింపు

పోటీ చేసే అభ్యర్థులు కచ్చితంగా ఎన్నికల నిబంధనలు పాటించాల్సిందేనని, ఉల్లంఘించినట్టు తేలితే కఠిన చర్యలు తీసుకుంటామని నాగిరెడ్డి హెచ్చరించారు. అభ్యర్థుల తుది జాబితా ప్రదర్శించిన తర్వాతే ప్రచారం ప్రారంభించాలని సూచించారు. ఉదయం 10...

రెండ్రోజులు కాళేశ్వరం, పునర్జీవ పథకం పనులను చూడనున్న సీఎం

తర్వాత ఈ పంపుహౌజ్ వద్ద ఉన్న కార్యాలయంలో ప్రాజెక్టు నిర్మాణ పనుల పురోగతిపై సాగునీటి శాఖ ఇంజినీర్లు, నిర్మాణ సంస్థల ప్రతినిధులతో సమీక్ష నిర్వహిస్తారు. అనంతరం మధ్యాహ్నం 3 గంటలకు కన్నెపల్లి నుంచి...

ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టు రీడిజైనింగ్‌లో

ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టు రీడిజైనింగ్‌లో భాగంగా రూపొందించిన కాళేశ్వరం ఎత్తిపోతల పథకంలో ప్రధానమైన మేడిగడ్డ బరాజ్ పనులకు సీఎం కేసీఆర్ 2016 మే రెండో తేదీన శంకుస్థాపన చేశారు. పనులను శరవేగంగా కొనసాగించడంతోపాటు.. మరోవైపు...

రైతును రాజు చేయాలనే సంకల్పంతో ముఖ్యమంత్రి కేసీఆర్ శ్రీకారం

రైతును రాజు చేయాలనే సంకల్పంతో ముఖ్యమంత్రి కేసీఆర్ శ్రీకారం చుట్టిన రైతుబంధు పథకం దేశానికి దిక్సూచిగా మారింది. వాస్తవానికి ఈ పథకాన్ని దేశవ్యాప్తంగా అమలు చేయాలని కేసీఆర్ అభిలషిస్తున్నారు. తొలుత ఎకరానికి ఎనిమిదివేలు...