99 చిత్రాలు పూర్తిచేసిన నేను వందవ సినిమాగా

0
32

గౌతమిపుత్రశాతకర్ణి చరిత్రను, పోరాటపటిమను భావితరాలకు తెలియజెప్పాలన్న సంకల్పంతో తెరకెక్కించిన చిత్రమిది. తెలుగువారికి గొప్ప చరిత్రను, దేశాన్ని అందజేసిన మహానుభావుడు శాతకర్ణి. తారకరాముని వారసుడిగా గౌతమిపుత్ర శాతకర్ణి చరిత్రను ప్రజలందరికి తెలియజేయడం బాధ్యతగా భావించాను అన్నారు బాలకృష్ణ. ఆయన నటిస్తున్న తాజా చిత్రం గౌతమిపుత్ర శాతకర్ణి. క్రిష్ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్ర థియేట్రికల్ ట్రైలర్‌ను శుక్రవారం కరీంనగర్‌లోని తిరుమల థియేటర్‌లో విడుదల చేశారు. అంతకు ముందు శాతవాహనుల రాజధానిగా ఖ్యాతినొందిన కోటిలింగాలలో బాలకృష్ణతో పాటు చిత్రబృందం ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం థియేట్రికల్ ట్రైలర్ ఆవిష్కరణలో బాలకృష్ణ మాట్లాడుతూ కరీంనగర్‌లో ట్రైలర్ విడుదల చేయడం ఆనందంగా వుంది. గౌతమిపుత్ర శాతకర్ణి కోటిలింగాలలో జన్మించి ఇక్కడే బాల్యాన్ని గడిపారు. శాతవాహన సామ్రాజ్యానికి సింహద్వారమైన కోటిలింగాల, మెదక్ జిల్లాలోని కొండాపూర్ వరకు కొన్నాళ్ల పాటు పరిపాలన కొనసాగించారు.

LEAVE A REPLY