7, 8 తేదీల్లో మన్యంలో జగన్ పర్యటన

0
23

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డి ఈ నెల 7, 8 తేదీల్లో తూర్పు గోదావరి జిల్లా పర్యటనకు రానున్నారని ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే కురసాల కన్నబాబు శనివారం విలేకరులకు తెలిపారు. 7న హైదరాబాద్ నుంచి రాజమహేంద్రవరం చేరుకుని రాజానగరం నియోజకవర్గంలో దివంగత మహానేత వై.ఎస్. రాజశేఖరరెడ్డి విగ్రహాన్ని ఆవిష్కరిస్తారని, అనంతరం రంపచోడవరం వెళ్లి అక్కడ పోలవరం ప్రాజెక్టు నిర్వాసితుల సమస్యలపై బాధితులతో మాట్లాడతారని చెప్పారు.

LEAVE A REPLY