67 ఏండ్లు .. 10 వేల ఆపరేషన్లు

0
19

ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 10 వేలకు పైగా ఆ పరేషన్లు చేసి రికార్డు సృష్టించారు ఆ వైద్యురాలు. 89 ఏండ్ల వయస్సులోనూ ప్రతిరోజు దవాఖానకు వెళ్తూ శస్త్రచికిత్స చేస్తూ మిగతా వైద్యులకు ఆదర్శంగా నిలుస్తున్నారు. రష్యాకు చెందిన అల్లా ఇలైనిచనా లెవుస్కిన (89) వృత్తి, ప్రవృత్తి వైద్య సేవలు అందించడమే. వృత్తినే దైవంగా భావించి ఆమె పెండ్లి కూడా చేసుకోలేదు. దివ్యాంగుడైన మేనల్లుడు, 8 పిల్లులు ఆమెకు తోడుగా ఉంటారు. ప్రతిరోజు ఉదయం 8 గంటలకే ఆమె దినచర్య మొదలవుతుంది. ఈ 67 ఏండ్ల సర్వీసులో 10 వేలకు పైగా మందికి శస్త్రచికిత్సలు చేశారు. విశేషమేమిటంటే ఆమె ఆపరేషన్ చేసిన ఏ ఒక్క రోగి కూడా చనిపోలేదు. వైద్యం అనేది వృత్తి కాదు తన జీవితమంటారు. ఎందుకు తాను పదవీ విరమణ చేయాలని ఆమె ఎదురు ప్రశ్నిస్తారు. మీ ఆరోగ్యానికి కారణమేంటని అడిగితే.. తాను అన్నీ తింటానని సమాధానమిస్తారు. ఎక్కువగా నవ్వుతాను, ఏడుస్తానని కూడా చెప్తారు. ప్రతిరోజు తనను తాను ఆస్తకికరంగా ఉండేలా చూసుకొంటానని, అలాగే గెలువాలని తపన పడుతానని చెప్తుంటారు. ఒక సందర్భంలో ఏ వైద్యుడూ ముందుకురాని శస్త్రచికిత్స చేశానని తెలిపారు.

LEAVE A REPLY