64వ జాతీయ అవార్డుల రేసులో 4 తెలుగు సినిమాలు

0
48
64వ జాతీయ చలనచిత్ర పురస్కారాలను త్వరలోనే ప్రకటించబోతున్నారు. దేశంలోనే అత్యుత్తమ సినిమా అవార్డ్స్ అయిన జాతీయ పురస్కారాలకు.. ఈ ఏడాది తెలుగు నుంచి నాలుగు చిత్రాలు పోటీలో ఉన్నాయి. 63వ జాతీయ చలన చిత్ర పురస్కారాల్లో ఉత్తమ చిత్రంగా అవార్డ్ కైవసం చేసుకుని.. తెలుగు సినిమాల సత్తాని జాతీయ స్థాయిలో చాటిన చిత్రం ‘బాహుబలి ది బిగినింగ్’. అదే స్పూర్తితో ఈ ఏడాది కూడా సుమారు 16 తెలుగు సినిమాలు.. జాతీయ పురస్కారాల పోటీలకు వెళ్లాయి. అయితే.. ఫైనల్ గా నాలుగు సినిమాలు అవార్డుల రేసులో ఉన్నాయి. చిరంజీవి రీ-ఎంట్రీ మూవీగా రూపొందిన ‘ఖైదీ నంబర్ 150’.. సంక్రాంతికి విడుదలై ఘన విజయాన్ని సాధించింది. తమిళంలో ‘కత్తి’ చిత్రానికి రీమేక్‌గా రూపొందిన ఈ సినిమాకు గత ఏడాదే సెన్సార్ పూర్తవ్వడంతో.. జాతీయ చలన చిత్ర పురస్కారాలకు పంపించారు. రైతుల కథాంశంతో తెరకెక్కిన ఈ చిత్రం.. రీమేక్ కాబట్టి.. ఉత్తమ చలన చిత్రం కేటగిరీలో కాకుండా.. మిగతా కేటగిరీల్లో పోటీలో ఉంది. మరి.. పాటలు, ఫైట్స్ పరంగా దుమ్మురేపిన ‘ఖైదీ నంబర్ 150’కి.. ఈ విభాగాల్లో ఏమైనా అవార్డ్స్ వస్తాయేమో చూడాలి.
         సంక్రాంతికి రెండు పెద్ద సినిమాల మధ్య చిన్న చిత్రంగా వచ్చి.. సూపర్ హిట్ సాధించిన సినిమా ‘శతమానం భవతి’. శర్వానంద్ కథానాయకుడిగా వేగేశ్న సతీష్ రూపొందించిన ఈ చిత్రం కూడా గత ఏడాదే సెన్సార్ పూర్తి చేసుకుంది. దీంతో.. నిర్మాత దిల్ రాజు ఈ చిత్రాన్ని జాతీయ పురస్కారాలకు పంపగా.. ఈ కుటుంబ కథా చిత్రం ఉత్తమ చలన చిత్రాల రేసులో నిలిచింది. ఈ ఏడాది ప్రకటించే జాతీయ ఉత్తమ చలన చిత్ర పురస్కారాల పోటీలో ‘పెళ్లి చూపులు’ సినిమా కూడా ఉంది. విజయ్ దేవరకొండ, రీతూ వర్మ జంటగా తక్కువ బడ్జెట్‌లో తరుణ్ భాస్కర్ తెరకెక్కించిన ఈ సినిమాను.. రాజ్ కందుకూరి నిర్మించాడు. ప్రస్తుతం ఈ సినిమా పలు భాషల్లో రీమేక్ అవుతోంది. 64వ జాతీయ చలన చిత్ర పురస్కారాల రేసులో ఆర్.పి. పట్నాయక్ రూపొందించిన ‘మనలో ఒక్కడు’ సినిమా కూడా ఉంది. మెసేజ్ ఒరియెంటెడ్ కథాంశంతో పట్నాయక్ తెరకెక్కించిన ఈ సినిమా విమర్శకుల ప్రశంసలు పొందింది. మొత్తంమీద.. 64వ జాతీయ చలన చిత్ర పురస్కారాల పోటీలో.. ఉత్తమ చిత్రం కేటగిరీలో.. ‘శతమానం భవతి’, ‘పెళ్లిచూపులు’, ‘మనలో ఒక్కడు’ సినిమాలు పోటీపడుతున్నాయి. ఇక.. మిగిలిన కేటగిరీల్లో చిరంజీవి ‘ఖైదీ నంబర్ 150’ అవార్డుల రేసులో ఉంది. మరి ఈ సారి ఏయే తెలుగు సినిమాలు జాతీయ అవార్డుల్లో వెలుగులు విరజిమ్ముతాయో చూద్దాం.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here