6సెకండ్లలో మీ కార్డు వివరాలు హ్యాకర్ల చేతిలోకి?

0
43

నోట్లరద్దు తర్వాత భారత్‌లో ఆన్‌లైన్ లావాదేవీలు, డిజిటల్ చెల్లింపులు పెరుగుతున్నాయి. ప్రపంచ వ్యాప్తంగా పలు దేశాలు ఇప్పటికే ఆన్‌లైన్ పేమెంట్స్‌లో ముందు వరుసలో ఉన్నాయి. ఇదే సమయంలో క్రెడిట్, డెబిట్ కార్డుల భద్రతపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ సమయంలోనే బ్రిటన్‌లోని న్యూకాస్టెల్ యూనివర్సిటీ పరిశోధక బృదం ఓ సంచలన ప్రకటన చేసింది. హ్యాకర్లు మీ క్రెడిట్, డెబిట్ కార్డుల పూర్తి వివరాలు కేవలం ఆరుసెకండ్లలో పసిగట్టవచ్చని ప్రకటించింది.

లండన్, డిసెంబర్ 2: డిజిటల్ పేమెంట్స్‌కు ప్రస్తుతం వీసా, మాస్టర్ కార్డ్, రూపే, అమెరికన్ ఎక్స్‌ప్రెస్ వంటి ప్లాట్‌ఫాంలు అందుబాటులో ఉన్నాయి. న్యూకాస్టెల్ శాస్త్రవేత్తల బృందం వీసా పేమెంట్ సిస్టంపై పరిశోధనలు చేపట్టింది. వివిధ వెబ్‌సైట్లలో ఉన్న లొసుగులు, వీసా వ్యవస్థలో ఉన్న భద్రతా లోపాల ఆధారంగా హ్యాకర్లు కేవలం ఆరు సెకండ్లలో డెబిట్ కార్డ్ నంబర్, వాలిడిటీ, సీవీవీ నంబర్, సెక్యూరిటీ కోడ్ వంటి వివరాలను సంపాదించే అవకాశం ఉందని తేల్చారు. తమ పరిశోధనా పత్రాలను యూనివర్సిటీ అకడమిక్ జర్నల్ ఐఈఈఈ సెక్యూరిటీ అండ్ ప్రైవసీలో ప్రచురించారు.

LEAVE A REPLY