5 లక్షల వరకు 5 శాతమే!

0
20

వ్యక్తిగత ఆదాయం పన్ను మినహాయింపు పరిమితి పెంచకున్నా కనిష్ఠ పన్ను శ్లాబుకు వర్తించే పన్ను రేటును మాత్రం సగానికి తగ్గిస్తున్నట్లు బడ్జెట్లో ఆర్థిక మంత్రి జైట్లీ ప్రకటించారు. ప్రస్తుతం రూ.2.5 లక్షల నుంచి రూ.5 లక్షల వరకు వార్షిక ఆదాయంపై చెల్లించాల్సిన పన్ను రేటు 10% కాగా, వచ్చే ఆర్థిక సంవత్సరానికి దీన్ని 5 శాతానికి తగ్గించారు. రూ.5 లక్షల నుంచి రూ.10 లక్షల వరకు ఆదాయంపై 20% పన్ను చెల్లించా లి. రూ.10 లక్షలకు పైగా వార్షికాదాయంపై 30% పన్ను చెల్లించాలి. ఈ రెండు పన్ను శ్లాబులను మాత్రం యథాతథంగా కొనసాగించారు. ఇక రూ.50 లక్షల నుంచి రూ. కోటి వరకు ఆదా యం ఆర్జిస్తున్నవారిపై గరిష్ఠ పన్నుతోపాటు 10% సర్‌చార్జీ విధిస్తున్నట్లు జైట్లీ ప్రకటించారు. రూ.కోటికి మించిన వారిపై ప్రస్తుతం విధిస్తున్న 15% సర్‌చార్జీ అలాగే కొనసాగుతుందని స్పష్టం చేశారు.

మొదటి శ్లాబుకు వర్తించే రూ. 2,500 రిబేటును కూడా పరిగణనలోకి తీసుకుంటే రూ.3 లక్షల వరకు ఆదాయంపై పన్ను చెల్లించాల్సిన అవసరం రాదని బడ్జెట్ ప్రసంగంలో జైట్లీ చెప్పారు. రూ.5 లక్షల కంటే అధిక ఆదాయం కలిగిన అన్ని క్యాటగిరీల వారికి రూ.12,500 వరకు ప్రయోజనాలు లభిస్తాయ న్నారు. తద్వారా పన్ను ఆదాయం రూ.15,500 కోట్ల మేర తగ్గనుందన్న జైట్లీ.. సర్‌చార్జీ విధింపుతో రూ.2,700 కోట్ల అదనపు ఆదాయం సమకూరనుందని తెలిపారు.

LEAVE A REPLY