5 ఐటీ కంపెనీలు, 5 వర్సిటీలతో ఒప్పందం

0
19

విశాఖ కేంద్రంగా ఫార్మా, ఐటీ, ఫైనాన్షియల్‌ టెక్నాలజీ (ఫిన్‌టెక్‌) రంగాల అభివృద్ధికి అడుగులు పడ్డాయి. విశాఖతోపాటు నవ్యాంధ్ర కేంద్రంగా ఫార్మా కంపెనీల ఏర్పాటుకు పలు అంతర్జాతీయ కంపెనీలు ముందుకొచ్చాయి. విశాఖలో ఏర్పాటు చేసిన ఫిన్‌టెక్‌ టవర్‌ను ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రారంభించారు. ఐదు ఐటీ కంపెనీలను కూడా ప్రారంభించారు. ఆయా రంగాల ప్రతినిధులతో ప్రత్యేకంగా సమావేశమై… నవ్యాంధ్రలో కంపెనీల స్థాపనకు ఉన్న అవకాశాలను వివరించారు. రాష్ట్రాన్ని ఫార్మా కేంద్రంగా మారుస్తామని ప్రకటించారు. ఆంధ్ర విశ్వకళాపరిషత్తు మైదానంలో 65వ ఇండియన్‌ ఫార్మాస్యూటికల్‌ కాంగ్రెస్‌ -2016ను చంద్రబాబు శనివారం ప్రారంభించారు.

LEAVE A REPLY