5స్టేట్స్ పోల్ వార్

0
15

ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు జాతీయ రాజకీయాల్లో ఎంతో కీలకం. దేశమంతా యూపీవైపే దృష్టి సారించిన నేపథ్యంలో ప్రధాని నరేంద్రమోదీకి తిరుగులేని ప్రజాదరణ.. అసాధారణ రీతిలో వివిధ సామాజిక వర్గాల సమీకరణ.. మత ప్రాతిపదికన రాజకీయ పునరేకీకరణ ద్వారా స్పష్టమైన ఆధిక్యత సాధిం చే దిశగా బీజేపీ ముందడుగు వేసింది. బుధవారం చివరిదశ పోలింగ్ జరుగనున్న నేపథ్యంలో అధికార సమాజ్‌వాదీ పార్టీ (ఎస్పీ) – కాంగ్రెస్ కూటమి, మాయావతి సారథ్యంలోని బీఎస్పీతో హోరాహోరీ పోరును ఎదుర్కొంటున్నా హిందుత్వ ఎజెండాను ముందుకు తెచ్చిన బీజేపీ తన వైరి పక్షాలకు స్పష్టమైన సంకేతాలిచ్చింది. తన తండ్రి-ఎస్పీ అధ్యక్షుడు ములా యం, బాబాయ్ శివ్‌పాల్ నుంచి గత జనవరి ఒకటో తేదీన అఖిలేశ్ పార్టీ నాయకత్వ పగ్గాలను అందుకోవడంతో కమలనాథులు తమ వ్యూహాన్ని మార్చుకోక తప్పలేదు.

LEAVE A REPLY