47 – 50 వరకు ఉష్ణోగ్రతలు

0
9

దేశ వ్యాప్తంగా ఎండ దంచేస్తున్నది. రోజు ఉష్ణోగ్రత 40 డిగ్రీలు దాటుతుండటంతో ఎండ సమయంలో ప్రజలు బయటికి రావడానికి జంకుతున్నారు. రాబోయే రోజుల్లో రాజస్థాన్‌లోని కొన్ని ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు 47 నుంచి 50 డిగ్రీల వరకు పెరిగే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖకు చెందిన సైంటిస్ట్ చేతన్ శర్మ ప్రకటించారు. మే, జూన్‌లో ఉష్ణోగ్రతలు జైపూర్‌లో 45 డిగ్రీలు దాటే అవకాశం ఉందని ఆయన చెప్పారు. బికనూర్, చురు, పక్కన ఉండే మిగితా జిల్లాల్లో మరింత వేడి ఉంటుందని ఆయన తెలిపారు.

LEAVE A REPLY