4 ల‌క్ష‌ల కోట్ల డిపాజిట్ల‌పై అనుమానం

0
17

న్యూఢిల్లీ: నోట్ల ర‌ద్దు త‌ర్వాత బ్యాంకింగ్ వ్య‌వ‌స్థ‌లోకి సుమారు రూ.4 ల‌క్ష‌ల కోట్ల న‌ల్ల‌ధ‌నం వ‌చ్చిన‌ట్లు ఐటీ అధికారులు అంచ‌నా వేస్తున్నారు. ఈ మొత్తానికి లెక్క‌లు చూప‌ని వారికి నోటీసులు ఇవ్వ‌డానికి సిద్ధ‌మ‌వుతోంది. డిసెంబ‌ర్ 17 వ‌ర‌కు 1.14 లక్ష‌ల ఖాతాల్లో రూ.80 ల‌క్ష‌లు అంత‌క‌న్నా ఎక్కువ మొత్తం డిపాజిట్ చేశార‌ని, ఈ మొత్తం రూ.4 ల‌క్ష‌ల కోట్ల‌కు చేరింద‌ని ఐటీ అధికారుల ద‌గ్గ‌రున్న స‌మాచారం వెల్ల‌డించింది. ప‌న్నులు ఎగ్గొట్టిన వారి ద‌గ్గ‌రి నుంచే ఈ మొత్తం వ‌చ్చిన‌ట్లు ఐటీ అధికారులు అనుమానిస్తున్నారు. ట్యాక్స్ రిట‌ర్న్స్‌తో బేరీజు వేసి ఈ డిపాజిట్ల లెక్క‌లు తేల్చే ప‌నిలో ఉన్నారు. ప‌న్నులు క‌ట్టేవాళ్లు ఇంత‌మొత్తంలో ఇళ్లలో డ‌బ్బు దాచుకునే అవ‌కాశ‌మే లేద‌ని అధికారులు భావిస్తున్నారు

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here