35 వేల ఉద్యోగాల భర్తీ

0
29

నీళ్లు.. నిధులు.. నియామకాలు.. స్వరాష్ట్ర సాధన కోసం తెలంగాణ ఉద్యమించడానికి ప్రధాన కారణాలు ఇవే. అన్నింటిలోనూ తెలంగాణ అన్యాయమైన కాలం అది. సమైక్యరాష్ట్రంలో తెలంగాణ బిడ్డకు ప్రభుత్వ ఉద్యోగ నియామకం సంగతి అటుంచి నోటిఫికేషన్లు కనిపించుడే కరువు. రాజకీయ అవసరాలు, ఇతర ప్రయోజనాల కోసం విద్యార్థులను మభ్యపెట్టేందుకు అప్పుడప్పుడు నామమాత్రపు సంఖ్యతో నోటిఫికేషన్లు విడుదలయ్యేవి. 2004 నుంచి 2014 నాటికి.. అంటే పదేండ్ల కాలంలో ఏపీపీఎస్సీ ద్వారా భర్తీచేసిన ఉద్యోగాల సంఖ్య కేవలం 24,086. ఇందులో తెలంగాణవారికి 6వేలు కూడా దక్కలేదని గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. ఆ పోస్టుల్లో దాదాపు 15వేల ఉద్యోగాల భర్తీకి సంబంధించిన నోటిఫికేషన్లు తెలంగాణ ఉద్యమం ఊపందుకున్న 2011-14 మధ్య కాలంలో విడుదలైనవే కావడం గమనార్హం. ఆ ఉద్యోగాల భర్తీలో అనేక అక్రమాలు జరిగినట్లు ఆరోపణలొచ్చాయి. స్వరాష్ట్ర ఆవిర్భావం తర్వాత తెలంగాణ ప్రభుత్వం కీలకమైన నియామకాలపై ప్రత్యేక దృష్టి సారించింది. తెలంగాణ యువత ఉద్యోగ కలను సాకారం చేసే క్రమంలో తొలి ప్రాధాన్యంగా టీఎస్‌పీఎస్సీని ఏర్పాటుచేసింది. అలా ఏర్పడిన కమిషన్.. మూడున్నరేండ్ల కాలంలోనే పలు ఉద్యోగాల భర్తీకి ఏకంగా 116 నోటిఫికేషన్లు జారీచేసింది. మొత్తం 35వేల ఉద్యోగాల భర్తీ ప్రక్రియ ప్రారంభించి చరిత్ర సృష్టించింది. భవిష్యత్తులో మరిన్ని ఉద్యోగాలు రానున్నాయి. తెలంగాణ పునర్నిర్మాణానికి అవసరమయ్యే ఉద్యోగులను ఎంపికచేసే బాధ్యతను అంతే బాధ్యతతో నిర్వర్తించడం గొప్పగా ఉంటున్నదని కమిషన్ చైర్మన్ ఘంటా చక్రపాణి సంతృప్తి వ్యక్తం చేశారు

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here