30% డ్రైవింగ్ లైసెన్సులు నకిలీవే!

0
32

దేశంలో 30 శాతం డ్రైవింగ్ లైసెన్సులు బోగస్‌వే అని కేంద్ర ఉపరితల రవాణాశాఖ మంత్రి నితిన్ గడ్కరీ చెప్పారు. ఢిల్లీలో బుధవారం రోడ్డు భద్రతపై నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ రోడ్డు భద్రతాప్రమాణాలకు సంబంధించి కొన్ని సమస్యలు ఉన్నాయని, రహదారులపై ప్రమాదకారక ఆటంకాలను గుర్తించడంతోపాటు రహదారి డిజైన్లను మార్చాల్సి ఉందన్నారు. ప్రజలు భద్రతా ప్రమాణాలు పాటించేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నట్టు తెలిపారు. అపరాధ రుసుములు విధించకుండా రోడ్డు భద్రత నిబంధనలను అమలు చేయడం సాధ్యం కాదన్నారు.

LEAVE A REPLY