29నే ఉగాది

0
43

ఉగాది పండుగను ప్రత్యక్ష ప్రామాణిక సిద్ధాంతం ఆధారంగా ఈ నెల 29న జరుపుకోవాలని తెలంగాణ బ్రాహ్మణ పరిషత్ రాష్ట్ర అధ్యక్షుడు గంగు భానుమూర్తి పేర్కొన్నారు. కొడకండ్ల సిద్ధాంతి నృసింహరావు శాస్త్రీయ వైదికమార్గంలో ఈ నెల 28న ఉగాది అని ప్రకటించడంతో పండుగపై అయోమయం నెలకొన్నది. ఈ క్రమంలో 29న ఉగాది పండుగ జరుపుకోవాలని గంగు భానుమూర్తి స్పష్టంచేశారు. న్యూనల్లకుంటలోని శ్రీ సీతారామాంజనేయ సరస్వతి ఆలయ ప్రాంగణంలో భానుమూర్తి ఆధ్వర్యంలో ధృక్, పూర్వగణిత పంచాంగ కర్తల సదస్సు జరిగింది. శ్రీనివాస వాగ్దేయ సిద్ధాంతి సమన్వయకర్తగా వ్యవహరించిన సదస్సులో జీయర్‌పీఠం యాదాద్రి ఆస్థాన సిద్ధాంతి సంపత్‌కుమార్, కృష్ణమూర్తి, కంచిపీఠం సిద్ధాంతి ఎల్‌ఎస్ సిద్ధాంతి, పుష్పగిరి సిద్ధాంతి ఓరుగంటి మనోహరశర్మ, విరూపాక్ష, శృంగేరి సిద్ధాంతులు, పరిషత్ ప్రధాన కార్యదర్శి పోచంపల్లి రమణరావు పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here