25 వేల కోట్ల‌కు కంపెనీ అమ్ముకున్న ఇండియ‌న్ టెకీ

0
19

జ‌్యోతి బ‌న్స‌ల్‌.. ఇత‌నో ఢిల్లీ ఐఐటీ స్టూడెంట్. ఎనిమిదేళ్ల కింద‌ట యాప్ డైన‌మిక్స్ పేరుతో అమెరికాలో ఓ కంపెనీ స్థాపించాడు. ఇప్పుడదే కంపెనీని సిస్కో 3.7 బిలియ‌న్ డాల‌ర్ల (సుమారు రూ.25 వేల కోట్లు)కు కొనుగోలు చేసింది. ప్ర‌స్తుతం కంపెనీలో బ‌న్స‌ల్‌కు 14 శాతం వాటా ఉంది. అంటే ఈ డీల్‌లో అత‌ను అందుకోబోయే మొత్తం 520 మిలియ‌న్ డాల‌ర్లు (రూ.3400 కోట్లు). ఐపీవోకి వెళ్లాల‌ని యాప్‌డైన‌మిక్స్ భావించిన ఒక రోజు ముందే ఈ డీల్ కుద‌ర‌డం విశేషం. ప్ర‌స్తుతం ఈ సంస్థ విలువ 2 బిలియ‌న్ డాల‌ర్లే అయినా.. సిస్కో మాత్రం దాదాపు రెట్టింపు చెల్లించి కొనుగోలు చేసింది.

బ‌న్స‌ల్ 1999లో ఢిల్లీలోని ఐఐటీలో గ్రాడ్యుయేష‌న్ పూర్తి చేశాడు. ఈ కంపెనీని అత‌ను స్టార్ట్ చేయ‌డం వెనుక కూడా ఓ ఆస‌క్తిక‌ర‌మైన క‌థ‌నం ఉంది. డిగ్రీ పూర్తి కాగానే బ‌న్స‌ల్ అమెరికా వెళ్లిపోయాడు. సిలికాన్ వ్యాలీ వెళ్ల‌డానికి బ‌న్స‌ల్‌కు అత‌ని తండ్రి ఇచ్చిన మొత్తం కేవ‌లం 200 డాల‌ర్లు. ఆ మొత్తంతో మొద‌లుపెట్టి బ‌న్స‌ల్ ఇప్పుడీ స్థాయికి చేరుకున్నాడు. సాఫ్ట్‌వేర్ అంటే త‌న‌కు అమిత‌మైన ఇష్టం. ఆ ఇష్టంతోనే గ్రాడ్యుయేష‌న్ పూర్త‌వ‌గానే హెచ్‌1బీ వీసాపై వెళ్లి ఓ స్టార్ట‌ప్ కంపెనీ కోసం ప‌నిచేశాడు. ఎనిమిదేళ్లు గ్రీన్‌కార్డ్ కోసం వేచి చూశాడు. 2005లో విలీ టెక్నాల‌జీలో ఆర్కిటెక్ట్‌గా బ‌న్స‌ల్ చేరాడు. మూడేళ్ల త‌ర్వాత ఆ కంపెనీని వ‌దిలిపెట్టి సొంతంగా యాప్ డైన‌మిక్స్‌ను ప్రారంభించాడు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here