246 కోట్ల నల్లడబ్బును అతడేం చేశాడంటే

0
42

నల్లడబ్బు వెలికితీతలో బిజీగా వున్న ఐటీ అధికారులు.. తమిళనాట ఒక అద్భుతాన్ని ఛేదించారు. ఒకే ట్రాన్సాక్షన్.. ఏకంగా రూ. 246 కోట్ల డిపాజిట్..! బినామీ ఖాతాలో జమయిన ఈ మొత్తాన్ని చూసి ఐటీ శాఖ కళ్ళు తేలేసింది. పెద్దనోట్ల రద్దు అమల్లో వున్న నవంబర్ 8 – డిసెంబర్ 30 మధ్య కాలంలో నాన్-బ్యాంకింగ్ అవర్స్‌లో ఈ డిపాజిట్ జరిగిందని, డిమోనిటైజేషన్ పీరియడ్‌‌లో జరిగిన అనుమానాస్పద లావాదేవీలన్నిటిలోకి ఇదే భారీ మొత్తమని ఐటీ అధికారులు లెక్కగట్టారు. ఇంకా కూపీ లాగితే.. బినామీ ఖాతాలో జమయిన ఈ రొక్ఖం.. ఒక తమిళ పొలిటీషియన్‌కు చెందిందని కూడా తెలిసింది.ఐటీ నోటీసులు పంపడంతో అతడు కూడా ‘టచ్’లోకి వచ్చేశాడట. కాకపొతే.. ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ యోజన పథకంలో చేరి.. పన్ను, జరిమానా కట్టడానికి అంగీకరించడంతో.. అతడు సేఫ్ అయినట్లు ఐటీ వర్గాలు చెబుతున్నాయి. మొత్తం నల్లడబ్బు 246 కోట్లలో 50 శాతం జరిమానా (123 కోట్లు), 25 శాతం కళ్యాణ్ యోజన పథకంలో పెట్టుబడి (62 కోట్లు) పోగా.. అతడికి మిగిలింది 62 కోట్లు మాత్రమే! సదరు ఆరవ నాయకుడు ఎవరో ప్రపంచానికి తెలీకపోయినా.. అతడు గవర్నమెంటుకు చేసిన ‘సాయం’ మాత్రం మెచ్చుకోదగ్గదే!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here