22 నుంచి కొమురెల్లి మల్లన్న జాతర

0
49

కొమరెల్లి మల్లన్న జాతర ఈ నెల 22వ తేదీ (ఆదివారం) నుంచి వరుసగా పది ఆదివారాలపాటు నిర్వహించనున్నారు. 23న హైదరాబాద్ భక్తులకోసం పెద్దపటం వేయనున్నారు. ఆ రోజు తెల్లవారుజామున అగ్నిగుండాలు ఉంటాయి. అగ్నిగుండాలలో భక్తులు శివనామస్మరణ చేస్తూ నడుస్తారు. ఫిబ్రవరి 24న మహాశివరాత్రి సందర్భంగా భారీస్థాయిలో అగ్నిగుండాలను ఏర్పాటు చేసి తర్వాత పెద్దపటం వేయనున్నారు. 22, 29వ తేదీల్లో వచ్చే ఆదివారాలను లష్కర్‌వారాలుగా పేర్కొంటారు. కొత్త జిల్లాల విభజనలో సిద్దిపేట జిల్లాలోకి వచ్చిన కొమరెల్లి మల్లన్న ఆలయాన్ని అభివృద్ధి చేసేందుకు దేవాదాయశాఖ కృషి చేస్తున్నది. రాష్ట్రంలోని భక్తులతోపాటు మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్, కర్ణాటకల నుంచి భక్తులు అధిక సంఖ్యలో జాతరకొచ్చి మల్లన్నను దర్శించుకొంటారు. మూడు నెలలపాటు జరిగే ఈ జాతరకోసం నిరంతర విద్యుత్తు అందించేలా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. మంచినీటి సదుపాయం కల్పించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. భక్తులు ఎక్కువ సంఖ్యలో వస్తుండటంతో క్యూలైన్లు ఏర్పాటు చేస్తున్నారు

LEAVE A REPLY