21రోజుల్లో 108 కిలోలు తగ్గిన ఇమాన్

0
24

ప్రపంచంలోనే అత్యంత బరువున్న మహిళగా రికార్డుల్లోకి ఎక్కిన ఇమాన్ అహ్మద్ మూడువారాల వ్యవధిలోనే 108 కిలోలు తగ్గిపోయారు. ఈజిప్టులోని అలెగ్జాండ్రియా నగరానికి చెందిన ఆమెను చికిత్స కోసం గత నెలలో ముంబైకి తరలించిన సంగతి తెలిసిందే. వైద్యులు తొలుత 25 రోజుల వ్యవధిలో 50 కిలోల బరువు తగ్గించాలని లక్ష్యంగా నిర్ణయించుకున్నారు. నిత్యం రెండు కిలోల బరువు తగ్గడం సాధ్యమేనా అని అనుమానించారు. కానీ, వారి అంచనాలకు విరుద్ధంగా అంతకు రెండింతలు తగ్గడంతో ఆశ్చర్యపోయారు. ఆమె దాదాపు 50 కిలోలు తగ్గవచ్చునని మేము భావించాం. కానీ వంద కిలోలకు పైగా తగ్గిపోవడం ఆశ్చర్యపరిచింది అని ఆమెకు చికిత్సచేస్తున్న బేరియాట్రిక్ సర్జన్ డాక్టర్ ముఫజల్ లక్డావాలా చెప్పారు. ఇమాన్ ఇప్పుడు 25 ఏండ్లలో తొలిసారిగా సొంతంగా కూర్చోగలుగుతున్నారు. ఇప్పుడామె బేరియాట్రిక్ సర్జరీకి అనుకూలంగా ఉన్నారని, తర్వాత సొంతంగా నిలబడగలుగుతారని వైద్యులు చెప్పారు. ఇమ్రాన్ శరీరం నుంచి భారీ స్థాయిలో నీరు తొలిగిపోయింది. నిత్యం ఫైబర్, ప్రొటీన్లతో కూడిన ద్రవాహారం ఇస్తూ, ఫిజియోథెరపీ చేస్తున్నారు. మం దుల ద్వారా సాధ్యమైనంత తగ్గించాలని ప్రయత్నించామని, ఇప్పుడు సర్జరీ చేయాల్సి ఉందని డాక్టర్ ముఫజల్ చెప్పారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here