2017-ట్విటర్‌ స్టార్‌ల జాబితా విడుదల మొదటి స్థానంలో ట్రంప్‌ రెండోస్థానంలో పోప్‌ ఫ్రాన్సిస్‌

0
26

ప్రపంచవ్యాప్తంగా 2017లో అత్యధిక ట్విటర్‌ పాలోవర్లు కలిగిన రాజకీయ నేతల జాబితాలో భారత ప్రధాని నరేంద్ర మోదీ చేరారు. సుమారు 34 కోట్లకు పైగా ఫాలోవర్లతో ఆయన మూడోస్థానంలో నిలిచారు. అత్యధిక ఫాలోవర్లు కలిగిన నేతగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ మొదటిస్థానంలో కొనసాగుతున్నారు. ఇదిలా ఉండగా.. రాజకీయాలతో సంబంధంలేని పోప్‌ ఫ్రాన్సిస్‌ రెండోస్థానంలో నిలవడం గమనార్హం. ట్రంప్‌కు పోప్‌ ఫ్రాన్సిస్‌కు మధ్య వ్యత్యాసం కేవలం 2 లక్షల ఫాలోవర్లు మాత్రమే.

ట్విటర్‌లో అత్యధిక జనదారణ కలిగిన రాజకీయ నాయకుల్లో భారత విదేశాంగ శాఖమంత్రి సుష్మా స్వరాజ్‌ సైతం మొదటి పదిమందిలో స్థానం దక్కించుకోవడం విశేషం. మహిళానాయకుల్లో సుష్మా స్వరాజ్‌కు ఉన్నంత ఫాలోయింగ్‌ మరెవ్వరికీ లేదని ట్విటర్‌ ప్రకటించింది. తాజాగా ట్విటర్‌ టాప్‌టెన్‌ ఫాలోవర్ల జాబితాను ట్వీట్‌ చేసింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here