2016 తెలంగాణకు మరుపురాని సంవత్సరం

0
29

బంగారు తెలంగాణ దిశగా రాష్ట భవిష్యత్తుకు బలమైన పునాది వేసిన సంవత్సరంగా 2016 నిలిచింది. చరిత్రలో మైలురాయిగా మిగిలేలా 21 కొత్త జిల్లాలు ఏర్పాటయ్యాయి. దశాబ్దాల అనంతరం రాష్ట్రం నలుమూలలా వేల చెరువులు మత్తడి దుంకి జలకళను సంతరించుకున్నాయి. చివరిదశలో ఉన్న అనేక ప్రాజెక్టులు, నీటిపథకాల ప్రారంభోత్సవాలు జరిగాయి. చరిత్రలో తొలిసారి కొత్త ప్రాంతాలకు ప్రాజెక్టులనుంచి నీరు అందింది. తెలంగాణ దశను మార్చే కాళేశ్వరం, పాలమూరు- రంగారెడ్డి ప్రాజెక్టుల శంకుస్థాపనలు జరిగాయి. మిషన్ భగీరథ తొలిదశ నీటి విడుదల జరిగింది. పారిశ్రామిక రంగం విశేష ప్రగతి సాధించింది. ప్రపంచ దిగ్గజాలు అనదగ్గ సంస్థలు రాష్ట్రంలో కాలు మోపాయి. సింగరేణి సంస్థ ఉత్పత్తి -లాభార్జనలో కొత్త రికార్డులు సృష్టించింది. సుదీర్ఘకాలంగా ఎదురుచూసిన డిపెండెంట్ ఉద్యోగాల కల నెరవేరింది. డబుల్‌బెడ్‌రూం బాలారిష్టాలన్నీ అధిగమించి పట్టాలెక్కి వేగం పెంచుకుంది.

LEAVE A REPLY