20 మంది కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు టీఆర్ఎస్ లో

0
8

టీఆర్ఎస్ లోకి వలసలు కొనసాగుతున్నాయి. దేవరుప్పుల మండలం, దర్మగడ్డ తండా, వాంకుడోతు తండాకు చెందిన 20 మంది కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు టీఆర్ఎస్ లో చేరారు. ఎమ్మెల్యే ఎర్రబెల్లి దయాకర్ రావు వారికి గులాబీ కండువా పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్బంగా ఎర్రబెల్లి దయాకర్ రావు మాట్లాడుతూ..పార్టీ కార్యకర్తలను కంటికి రెప్పలా కాపాడుకుంటామన్నారు. సీఎం కేసీఆర్ చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలతో ప్రతిపక్షాలన్నీ కంగారుపడుతున్నాయన్నారు. రైతులంతా రైతుబంధుతో సంతోషంగా ఉన్నారని చెప్పారు. ఈ కార్యక్రమంలో పలువురు ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here