19 కొత్త జాతీయ రహదారులు : సీఎం

0
24

హైదరాబాద్ : రాష్ర్టానికి కొత్తగా 19 జాతీయ రహదారులు మంజూరైనట్లు ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించారు. శాసనసభలో జాతీయ రహదారులపై స్వల్ప కాలిక చర్చ సందర్భంగా సీఎం మాట్లాడారు. జాతీయ రహదారుల విషయంలో సమైక్య రాష్ట్రంలో బాధపడ్డాం. తెలంగాణకు తీవ్ర అన్యాయం జరిగిందన్నారు. జాతీయ రహదారులు తెలంగాణలో తక్కువగా ఉండటం, ఆంధ్రాలో ఎక్కువగా ఉండటం చూశాం. కానీ రాష్ట్రం ఏర్పడిన తర్వాత రాష్ట్రంలో జాతీయ రహదారుల సంఖ్య పెరిగింది. నూతన జాతీయ రహదారుల నిర్మాణానికి కేంద్రాన్ని అంగీకరింపజేయడంలో, నిధులు సమకూర్చడంలో తెలంగాణ ప్రభుత్వం విజయం సాధించిందని తెలిపారు. ఈ విజయం బంగారు తెలంగాణ సాధనలో ఒక మేలి మలుపు అని అన్నారు

LEAVE A REPLY