19న ఎల్బీ స్టేడియం పరిసరాల్లో ట్రాఫిక్ ఆంక్షలు

0
28

హైదరాబాద్ : ఈ నెల 19న ఎల్బీ స్టేడియం పరిసరాల్లో ట్రాఫిక్ ఆంక్షలు ఉంటాయని సీపీ మహేందర్ రెడ్డి ప్రకటించారు. క్రిస్మస్ పండుగ సందర్భంగా ఎల్బీ స్టేడియంలో మంగళవారం రాత్రి ప్రభుత్వం తరపున విందు ఏర్పాటు చేయనున్నారు. రాత్రి 7 గంటల నుంచి 9 గంటల వరకు ట్రాఫిక్ ఆంక్షలు అమల్లో ఉంటాయని స్పష్టం చేశారు. ఈ రెండు గంటల పాటు వాహనదారులు ప్రత్యామ్నాయ మార్గాల్లో వెళ్లి పోలీసులకు సహకరించాలని కోరారు.

-ఏఆర్ పెట్రోల్ బంక్ వైపు నుంచి బీజేఆర్ విగ్రహాం వైపు ట్రాఫిక్‌ను అనుమతించరు, ఈ వాహనాలను నాంపల్లి, రవీంద్రభారతి వైపు మళ్లిస్తారు.
-ఆబిడ్స్, గన్‌పౌండ్రీ వైపు నుంచి వచ్చే వాహనాలను బీజేఆర్ విగ్రహాం, బషీర్‌బాగ్ వైపు అనుమతించరు, ఈ వాహనాలను గన్‌పౌండ్రీ దగ్గర చాపల్‌రోడ్డు వైపు మళ్లిస్తారు.
-బషీర్‌బాగ్ జంక్షన్ నుంచి జీపీఓ, ఆబిడ్స్ వైపు వాహనాలను అనుమతించరు, ఈ రూట్‌లో వెళ్లాల్సిన వాహనాలను హైదర్‌గూడ, కింగ్‌కోఠి రోడ్డు వైపు మళ్లిస్తారు.
-ఓల్డ్ ఎమ్మెల్యే క్వార్టర్స్ నుంచి బషీర్‌బాగ్ వైపు వచ్చే వాహనాలను హిమాయత్‌నగర్ వై జంక్షన్ వైపు మళ్లిస్తారు.
-భారతీయ విద్యాభవన్ మీదుగా కింగ్ కోఠి నుంచి బషీర్‌బాగ్ వైపు వెళ్లే వాహనాలను కింగ్‌కోఠి ఎక్స్‌రోడ్స్ నుంచి తాజ్‌మహాల్, ఇడెన్ గార్డెన్ వైపు మళ్లిస్తారు.
-లిబర్టీ నుంచి బషీర్‌బాగ్ వైపు వచ్చే వాహనాలను లిబర్టీ జంక్షన్‌లో, హిమాయత్‌నగర్ వైపు మళ్లిస్తారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here