18 నుంచి 20 వయసు నిరుద్యోగ అభ్యర్థులకు ఇంటర్వ్యూలు

0
23

జిల్లా గ్రామీణాభివ ృద్ధి సంస్థ, ఉపాధి కల్పన మిషన, డాక్టర్‌ రెడ్డీస్‌ సంయుక్త ఆధ్వర్యంలో హైదరాబాద్‌, విశాఖపట్నంలో సెల్ఫ్‌ మేనేజ్డ్‌ టీమ్స్‌లో పని చేసేందుకు గ్రామీణ నిరుద్యోగ అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు డీఆర్‌డీఏ ప్రాజెక్ట్‌ డైరెక్టర్‌ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. అభ్యర్థులు 18 నుంచి 20 ఏళ్ల మధ్య వయసు కలిగి ఇంటర్‌ ఎంపీసీ, బైపీసీల్లో కనీసం 60 శాతం ఉత్తీర్ణత కలిగి ఉండాలని, బీఎస్సీ మొదటి సంవత్సరం చదువుతున్న వారు కూడా దరఖాస్తు చేసుకోవచ్చని వివరించారు. ఆసక్తి కలిగిన యువతీ, యువకులు విద్యార్హత ధ్రువీకరణ పత్రాలు, రేషనకార్డు, ఆధార్‌ కార్డు జిరాక్స్‌లు, పాస్‌ఫోర్ట్‌ సైజు ఫోటోలతో డిసెంబర్‌ రెండో తేదీ ఉదయం 9.30 గంటలకు గుంటూరు పట్టాభిపురంలోని టీజేపీఎస్‌ కళాశాలలో నిర్వహించే ఇంటర్వ్యూలకు హాజరుకావాలని కోరారు. పూర్తి వివరాలకు డీఆర్‌డీఏ కార్యాలయంలో సంప్రదించాలని (ఫోన నెంబరు: 0863-2210757) సూచించారు.

LEAVE A REPLY