16 సీట్లు గెలిస్తే కేంద్రంలో కీలకపాత్ర

0
15

అసెంబ్లీ ఎన్నికల్లో ఆశీర్వదించినట్టే 16 పార్లమెంట్ స్థానాల్లో టీఆర్‌ఎస్‌ను గెలిపించి కేంద్రంలో కీలకపాత్ర పోషించేలా, రాష్ర్టాన్ని అభివృద్ధి చేసుకునేలా అందరూ సహకరించాలని కేటీఆర్ విజ్ఞప్తిచేశారు. పార్లమెంట్ ఎన్నికలంటే మోదీ వర్సెస్ రాహుల్ అంటున్నారని.. అయితే నాగలి దున్నాలంటే జత ఎద్దులుగానీ, జత దున్నపోతులనుగానీ కట్టాలని, ఒక ఎద్దును, ఒక దున్నపోతును కడితే దున్నడం కష్టమవుతుందని చెప్పారు. మోడీ గ్రాఫ్ పడిపోతున్నదని, కాంగ్రెస్ పరిస్థితి దయనీయంగా మారిందన్నారు. సర్వేలన్నీ కాంగ్రెస్, బీజేపీకి తక్కువ సీట్లు వస్తాయని చెప్తున్నాయని, రెండు పార్టీలు కలిసినా ప్రభుత్వం ఏర్పాటుచేయలేని వింత పరిస్థితి రాబోతున్నదని చెప్పారు. దేశాన్ని కాంగ్రెస్ 50 ఏండ్లు, బీజేపీ 15 ఏండ్లు పాలించాయని అయినా సమస్యల పరిష్కారంపై వారికి చిత్తశుద్ధి లేదని విమర్శించారు. దేశంలో గుణాత్మక మార్పుతోపాటు అభివృద్ధి జరుగాలంటే ప్రాంతీయ పార్టీలతో కూడిన ఫెడరల్ ఫ్రంట్ అధికారంలోకి రావాలన్నారు. అప్పుడే రాష్ర్టాలకు తమ సమస్యలను పరిష్కరించుకునే అవకాశం కలుగుతుందన్నారు. 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here