154వ రోజు ప్రజాసంకల్పయాత్ర ప్రారంభం

0
8

వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి చేపట్టిన ప్రజాసంకల్పయాత్ర కృష్ణా జిల్లాలో విజయవంతంగా కొనసాగుతుంది. పెడన నియోజకవర్గంలోని కొంకెపూడి శివారు నుంచి ఆదివారం ఉదయం రాజన్న బిడ్డ 154వ రోజు పాదయాత్ర ప్రారంభమైంది. అక్కడి నుంచి గుడివాడ నియోజకవర్గంలోని రెడ్డిపాలెం, వడ్లమన్నాడు, వేమవరం, కవుతారం మీదుగా గుడ్లవల్లేరు వరకు పాదయాత్ర కొనసాగుతుంది. రాత్రికి వైఎస్‌ జగన్‌ అక్కడే బస చేస్తారు.

ప్రజల సమస్యలు తెలుసుకుంటూ.. వారికి నేనున్నా అని భరోసానిస్తూ వైఎస్‌ జగన్‌ పాదయాత్రలో ముందుకు సాగుతున్నారు. అడుగడునా జననేతకు ప్రజలు నీరాజనాలు పలుకుతున్నారు. వైఎస్‌ జగన్‌ రాకతో పాదయాత్ర సాగుతున్న మార్గంలో పండుగ వాతావరణం నెలకొంది.

LEAVE A REPLY