15 ఏండ్ల తర్వాత జూనియర్ హాకీ ప్రపంచకప్ విజేతగా భారత్

0
19

లక్నో: యువ భారత జట్టు అభిమానుల అంచనాలు నిలబెట్టింది. సొంతగడ్డపై హాట్ ఫేవరెట్ హోదాతో జూనియర్ హాకీ ప్రపంచకప్‌లో విజేతగా నిలిచి ఔరా అనిపించింది. ఆదివారం ముగిసిన జూనియర్ హాకీ ప్రపంచకప్ ఫైనల్లో కఠిన ప్రత్యర్థి బెల్జియం జట్టును 2-1 గోల్స్ తేడాతో ఓడించి భారత యువజట్టు రెండోసారి ప్రపంచ చాంపియన్‌గా నిలిచింది. జూనియర్ హాకీ ప్రపంచకప్‌లో ఇప్పటికి మూడుసార్లు భారత కుర్రాళ్లు ఫైనల్ చేరారు. 1997లో రన్నరప్‌గా నిలిచిన భారత జట్టు 2001లో ఆస్ట్రేలియాలోని హోబర్ట్‌లో జరిగిన టోర్నీలో విజేతగా నిలిచింది. మళ్లీ 15 ఏండ్ల తర్వాత సొంతగడ్డపై జరిగిన టోర్నీలో జయకేతనం ఎగరేసింది. ఈ విజయంతో ప్రపంచ కప్ గెలిచిన తొలి ఆతిథ్య జట్టుగా రికార్డు సృష్టించిన భారత్.. జర్మనీ తర్వాత రెండుసార్లు ప్రపంచకప్ అందుకొన్న జట్టుగానూ ఘనత వహించింది.

LEAVE A REPLY