15వ తేదీ దాటితే జోన్-3కి సాగర్ నీళ్లివ్వలేం

0
21

నాగార్జునసాగర్ ఎడమ కాలువ పరిధిలోకి వచ్చే జోన్-3(నూజివీడు తదితర ప్రాంతాలు)లో ఈ నెల15లోపే సాగునీటిని వాడుకోవాలని తెలంగాణ నీటిపారుదల శాఖ అధికారులు ఏపీకి సూచించారు. తెలంగాణలో ఎడమకాలువ ఆధునీకరణ పనులు చేపట్టాల్సి ఉన్నందున 15 తర్వాత నీటి విడుదల సాధ్యంకాదని ఆంధ్రప్రదేశ్ జలవనరుల శాఖకు స్పష్టం చేశారు. కాగా శ్రీశైలంనుంచి నాగార్జునసాగర్‌కు 5-6 టీఎంసీల నీటిని విడుదల చేస్తే ఆ మేరకు జోన్-3కి అందిస్తామని తెలిపారు. ఇదే సమయంలో తెలంగాణలో తాగునీటి అవసరాలకు 10 టీఎంసీల నీరు కేటాయించాలని కృష్ణాబోర్డుకు కూడా అధికారులు లేఖ రాశారు. ఈ మేరకు బోర్డు ఒక సమావేశం నిర్వహించే అవకాశం ఉంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here