149 కోట్ల బిల్లు వేసిన ఓలా క్యాబ్

0
21

ఏప్రిల్ ఒక‌టినే ఓ వ్య‌క్తికి ఈ బిల్లు వ‌చ్చినా.. ఇది ఏప్రిల్ ఫూల్ జోక్ మాత్రం కాదు. నిజంగానే ఓలా క్యాబ్ ముంబైలోని సుశీల్ న‌ర్సియాన్ అనే వ్య‌క్తికి రూ.149 కోట్ల బిల్లు వేసింది. అదీ కేవ‌లం 300 మీట‌ర్ల దూరానికి. మ‌రో విచిత్రం ఏమిటంటే అస‌లు అత‌డు క్యాబే ఎక్క‌లేదు. త‌న ఇల్లు ఉన్న ములుంద్ నుంచి వ‌కోలా మార్కెట్‌కు వెళ్ల‌డానికి సుశీల్‌.. ఓలా క్యాబ్ బుక్ చేసుకున్నాడు. అయితే క్యాబ్ డ్రైవ‌ర్ ఫోన్ ప‌నిచేయ‌క‌పోవ‌డం వ‌ల్ల‌ అత‌ని ఇంటిని క‌నిపెట్ట‌లేక‌పోయాడు. దీంతో సుశీలే.. ఆ క్యాబ్ ద‌గ్గ‌రికి న‌డ‌వ‌డం మొద‌లుపెట్టాడు. అయితే సుశీల్‌.. క్యాబ్ ద‌గ్గ‌రికి వెళ్ల‌లోపే స‌దరు డ్రైవ‌ర్ బుకింగ్‌ను క్యాన్స‌ల్ చేసేశాడు.

మ‌రో క్యాబ్ బుక్ చేయ‌డానికి సుశీల్ ప్ర‌య‌త్నించ‌గా.. అత‌ని క‌ళ్లు బైర్లు క‌మ్మే మెసేజ్ ఒక‌టి మొబైల్‌కు వ‌చ్చింది. ఇప్ప‌టికే రూ. 149.1 కోట్ల బిల్లు చెల్లించాల్సి ఉన్నందున మ‌రో క్యాబ్ బుక్ చేసుకొనే అవ‌కాశం లేద‌న్న‌ది ఆ మెసేజ్ సారాంశం. అంతేకాదు అప్ప‌టికే అత‌ని వ్యాలెట్‌లో ఉన్న రూ.127ను స‌ద‌రు ఓలా క్యాబ్ తీసేసుకుంది. మొద‌ట తాను ఏప్రిల్ ఫూల్ జోక్ అని అనుకున్నా.. కంపెనీతో మాట్లాడితేగానీ అది నిజ‌మ‌ని తేల‌లేద‌ని సుశీల్ చెప్పాడు. అయితే సాంకేతిక కార‌ణాల వ‌ల్ల ఈ స‌మ‌స్య త‌లెత్తింద‌ని కంపెనీ అత‌నికి చెప్పింది. రెండు గంట‌ల్లోనే అత‌ని డ‌బ్బును తిరిగి ఇవ్వ‌డంతోపాటు ఆ 149 కోట్ల బిల్లును కూడా ర‌ద్దు చేసింది.

అయితే అప్ప‌టికే ఈ భారీ బిల్లు వార్త సోష‌ల్ మీడియాలో చ‌క్క‌ర్లు కొట్టింది. రూ.149 కోట్లా.. ఎక్క‌డ డ్రాప్ చేశారు? ప‌్లూటోనా.. నెప్ట్యూనా? అంటూ ఓ యూజ‌ర్ ఫేస్‌బుక్‌లో ఆశ్చ‌ర్యం వ్య‌క్తంచేశాడు. అయితే ఇంత జ‌రిగినా.. ఆ కంపెనీపై త‌న‌కు ఎలాంటి దుర‌భిప్రాయం లేద‌ని, వాళ్ల యాప్‌ను వాడ‌టం కొన‌సాగిస్తాన‌ని సుశీల్ చెప్పాడు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here