1400 మంది పర్యాటకులు క్షేమం

0
18

తుఫాన్ వాతావరణంతో అండమాన్‌లోని హవెలాక్ ద్వీపంలో చిక్కుకున్న 1400 మంది పర్యాటకులు సురక్షితమని కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్ సింగ్ చెప్పారు. ఈ విషయమై అండమాన్ నికోబార్ లెప్టినెంట్ గవర్నర్ జగదీశ్ ముఖి ద్వారా వివరాలు అడిగి తెలుసుకున్నట్లు ఓ ప్రకటనలో తెలిపారు. పర్యాటకుల భద్రత, తుఫాన్ ప్రభావంపై సమీక్ష జరిగిన తర్వాత లెఫ్టినెంట్ గవర్నర్ జగదీశ్ ముఖీ, దక్షిణ అండమాన్ డిప్యూటీ కమిషనర్ ఉదిత్‌ప్రకాశ్ రాయ్ మీడియాతో మాట్లాడుతూ హోటళ్ల యాజమాన్యాలు తమ తమ హోటళ్లలో బసచేసిన పర్యాటకుల వద్ద అద్దె వసూలుచేయొద్దని, ఉచితంగానే తాగునీరు, భోజన వసతి కల్పించాలని నిర్ణయించామన్నారు. తుఫాన్ ప్రభావం తగ్గుముఖం పట్టిన తర్వాత పర్యాటకులను వారి సొంత ప్రదేశాలకు పంపడమే తమకు ప్రాధాన్యం అన్నారు.

LEAVE A REPLY