113 ఏండ్ల నుంచి ఎవరూ ఈ రికార్డును అందుకోని వైనం

0
26

139 ఏండ్ల టెస్టు క్రికెట్ చరిత్రలో ఎంతో మంది దిగ్గజాలు ఎన్నో రికార్డులు నెలకొల్పారు.. మరెన్నో రికార్డులను బద్దలు కొట్టారు. కానీ 113 ఏండ్లుగా ఒక్క రికార్డు మాత్రం చెక్కు చెదరకుండా అలాగే ఉండిపోయింది. అదే.. అరంగేట్రం టెస్టులో అత్యధిక వ్యక్తిగత స్కోరు (287) రికార్డు. కుర్రాళ్లుగా ఆటను మొదలుపెట్టి దిగ్గజాలుగా మారిన ఎంతో మంది కోచ్‌లు కూడా తమ శిష్యులతో ఈ రికార్డును బద్దలు కొట్టించాలని చూసినా అందని ద్రాక్షగానే మిగిలింది. కనీసం రాబోయే తరంలోనైనా ఈ రికార్డు బద్దలుకొట్టే క్రికెటర్ వస్తాడో లేదంటే సచిన్, కోహ్లీ మరోసారి జన్మించి దీనికోసం ప్రయత్నించాలేమో..!
పాతతరంలో బ్రాడ్‌మన్ నెలకొల్పిన రికార్డుల్లో కొన్నింటిని ఆ తర్వాతి కాలంలో రిచర్డ్స్, సోబర్స్, లారా, అక్రమ్, కపిల్‌లాంటి దిగ్గజాలు బద్దలు కొట్టారు. నిన్నటి తరంలో సచిన్, పాంటింగ్, గిల్‌క్రిస్ట్, జయసూర్య, సెహ్వాగ్, మెకల్లమ్‌లాంటి హిట్టర్లు కొన్నింటిని ఛేదించేశారు. ఇక మిగిలి ఉన్న రికార్డులను ఇప్పుడు కొత్త తరంలో ధోనీ, కోహ్లీ, రోహిత్, క్రిస్ గేల్, డివిలియర్స్, డు ఫ్లెసిస్, రూట్ వేటాడుతున్నారు. ఈ క్రమంలో చాలా రికార్డులు దాదాపుగా తుడిచిపెట్టుకుపోతున్నాయి. కానీ 113 ఏండ్ల కిందట ఇంగ్లండ్ బ్యాట్స్‌మన్ టిప్ ఫోస్టర్ కెరీర్ తొలి టెస్టులో నెలకొల్పిన రికార్డు మాత్రం ఇంకా కొనసాగుతున్నది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here