11న ఖైదీ విడుదల

0
33

చిరంజీవి కథానాయకుడిగా నటిస్తున్న చిత్రం ఖైదీ నంబర్ 150. వి.వి.వినాయక్ దర్శకత్వం వహిస్తున్నారు. కొణిదెల ప్రొడక్షన్స్ పతాకంపై రామ్‌చరణ్ నిర్మిస్తున్నారు. కాజల్ అగర్వాల్ కథానాయిక. ఈ నెల 11న సినిమా ప్రేక్షకుల ముందుకురానుంది. ఈ సందర్భంగా నిర్మాత రామ్‌చరణ్ మాట్లాడుతూ సందేశాత్మక కథాంశంతో తెరకెక్కుతున్న పవర్‌ఫుల్ యాక్షన్ ఎంటర్‌టైనర్ ఇది. తమిళ చిత్రం కత్తి ఆధారంగా రూపొందించాం. చిరంజీవి నటన, ఆయనపై చిత్రీకరించిన పోరాట ఘట్టాలు అలరిస్తాయి. తొలుత ఈ నెల 12న సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని భావించాం. కానీ ఇద్దరు అగ్ర హీరోల సినిమాలు ఒకే రోజున విడుదల కావడం మంచి పరిణామం కాదని నాన్న చెప్పారు. ఆయన సూచనతో 11న సినిమాను విడుదల చేస్తున్నాం. దేవీశ్రీ ప్రసాద్ బాణీలకు చక్కటి ఆదరణ లభిస్తున్నది. ప్రీరిలీజ్ వేడుకను ఈ నెల 7న విజయవాడ, గుంటూరు మధ్యలో ఉన్న హాయ్‌ల్యాండ్‌లో నిర్వహించనున్నాం అని తెలిపారు. తరుణ్ ఆరోరా, అలీ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రానికి మాటలు: పరుచూరి బ్రదర్స్, సినిమాటోగ్రఫీ: రత్నవేలు, సంగీతం: దేవీశ్రీప్రసాద్

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here