11నుంచి లగేజ్‌ ఎక్కువ ఉంటే ఎయిర్ ఇండియాలో భారమే..!

0
6

మీరు ఎయిర్ ఇండియాలో ప్రయాణం చేయాలనుకుంటే ఇకనుంచి మీ సామన్లు కాస్త తక్కువగా ఉండేలా చూసుకోవాల్సిందే. ఎందుకంటే జూన్ 11నుంచి అంటే ఈ రోజు నుంచి పరిమితి కంటే ఎక్కువ లగేజ్‌ను వెంట తీసుకెళ్లే వారి మీద ఈ జాతీయ విమానయాన సంస్థ అదనంగా ఛార్జీల భారం మోపనుంది. అదనపు సామాన్ల మీద రూ.400 నుంచి రూ. 500వరకు వసూలు చేయనుంది. అయితే ఎయిర్ ఇండియా అనుబంధ సంస్థ అలయన్స్‌ ఎయిర్ మాత్రం ఈ పరిధిలోకి రాదు. ‘ జూన్ 11 నుంచి పరిమితి కంటే ఎక్కువ లగేజీని తీసుకొచ్చే ప్రయాణికులపై రూ.400 నుంచి రూ. 500 వరకు అదనంగా వసూలు చేయనున్నాం’ అని ఎయిర్ లైన్స్‌ విడుదల చేసిన ప్రకటనలో వెల్లడించింది

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here