హ్యాపీ బర్త్‌డే ‘మాస్‌ మహారాజా’

0
34

సహాయ దర్శకుడిగా, నటుడిగా, ప్రతినాయకుడిగా చిన్న చిన్న పాత్రల్లో నటించి స్టార్‌ కథానాయకుడిగా ఎదిగిన అతి కొద్దిమంది నటుల్లో రవితేజ ఒకరు. మాస్‌ చిత్రాలతో ప్రేక్షకులను అలరిస్తూ తెలుగు చిత్ర పరిశ్రమలో తనదైన ముద్రవేశారాయన. అందుకే ఆయన్ను అభిమానులు ‘మాస్‌ మహారాజా’గా పిలుచుకుంటుంటారు. ఒక్కమాటలో చెప్పాలంటే.. ఆయన సినిమాలో ఉండే ‘కిక్‌’ వేరు.. అమ్మాయిల మదిదోచే ‘ఇడియట్‌’ అతడు. చిన్న పాత్రలతో వచ్చి.. ‘ఖడ్గం’ పట్టి చూపించి.. తన నటనకు ఉన్న పదునెంతో చూపిన ‘విక్రమార్కుడు’. ‘అమ్మా నాన్న ఓ తమిళ అమ్మాయి’తో ‘ఈ అబ్బాయి చాలా మంచోడు’ అనిపించుకున్నాడు ‘వెంకీ’, ‘భద్ర’, ‘దుబాయ్‌ శీను’తో అలరించి.. ‘నేనింతే’ అనే ‘ఖతర్నాక్‌’ ఆయన. ‘డాన్‌ శీను’ నుంచి ‘మిరపకాయ్‌’గా మారి ‘దరువు’ వేశాడు. ‘బెంగాల్‌ టైగర్‌’తో తన ‘పవర్‌’ ఏంటో చూపించాడు.

రవితేజ సినిమా అనగానే వినోదం గ్యారెంటీ అని అభిమానులు ఫిక్స్‌ అయిపోతారు. అది దృష్టిలో పెట్టుకునే రవితేజ కూడా తను చేసే చిత్రాల్లో కావాల్సినంత వినోదం ఉండేలా చూసుకుంటారు. వయసు పెరుగుతున్న కొద్దీ.. ఆయనలో చురుకుదనం పెరుగుతోంది. అందుకే 48 ఏళ్ల వయసులోనూ కుర్ర హీరోలకు పోటీగా పరుగెడుతున్నారు. గురువారం రవితేజ పుట్టినరోజు జరుపుకొంటున్న సందర్భంగా శుభాకాంక్షలు చెబుదాం.

LEAVE A REPLY