హ్యాపీబర్త్‌డే ‘శ్రద్ధ’

0
25

చదువులో టాపర్‌. అయినా సినిమాలపై ఆసక్తితో బోస్టన్‌ యూనివర్శిటీలో చదువు ఆపేసి బాలీవుడ్‌లో అడుగుపెట్టింది. యూనివర్శిటీలో చదువుకుంటున్న సమయంలో నటనపై ఆసక్తితో స్టేజ్‌పై నాటకాల్లో నటించింది. నటనపై ఆమెకున్న ఆసక్తిని గుర్తించి సినిమాలో అవకాశం ఇవ్వడానికి ఏకంగా సల్మాన్‌ ఖాన్‌ ముందుకొచ్చాడు. ఆమె ఎవరో కాదు బాలీవుడ్‌ బబ్లీ గర్ల్‌ శ్రద్ధాకపూర్‌. అలనాటి బాలీవుడ్‌ నటుడు శక్తికపూర్‌ కుమార్తె అయిన శ్రద్ధ ఈరోజు తన 30వ పుట్టినరోజు జరుపుకొంటోంది.

శ్రద్ధా కపూర్‌ ముంబయిలో పుట్టి పెరిగింది. తండ్రి సినీనటుడే కావడంతో ఇల్లంతా సినిమా వాతావరణమే ఉండేది. చదువులో ఎప్పుడూ ఫస్ట్‌ వచ్చినా, సినిమాలంటేనే ఆసక్తి. ఎంత ఆసక్తి అంటే చిన్నప్పుడు తన తండ్రి దుస్తులు వేసుకుని అద్దం ముందు నిలబడి ఆయన డైలాగులు చెప్తుండేది. అలా చేస్తే హీరోయిన్‌ అయ్యాక డైలాగులు చెప్పడం ప్రాక్టీస్‌ అవుతుందని. బాలీవుడ్‌ యంగ్‌ నటులు వరుణ్‌ ధావన్‌, టైగర్‌ ష్రాఫ్‌లు శ్రద్ధకి క్లాస్‌మేట్స్‌.

తొలిసినిమా ‘ఆషికి-2’ కాదు
శ్రద్ధ కపూర్‌ అనగానే అందరికీ గుర్తొచ్చేది ‘ఆషికీ-2’ చిత్రం. కానీ శ్రద్ధ బాలీవుడ్‌లో నటించిన తొలి సినిమా అది కాదు. 2010లో ‘తీన్‌ పట్టి’ సినిమాలో అమితాబ్‌, బెన్‌ కింగ్‌స్లే, మాధవన్‌లతో కలిసి విద్యార్థిని పాత్రలో నటించింది. ఆ తర్వాత 2011లో ‘లవ్‌ కా ది ఎండ్‌’లో పూర్తి తరహా హీరోయిన్‌గా నటించింది. ఆ తర్వాత ప్రముఖ నిర్మాణ సంస్థ యశ్‌రాజ్‌ ఫిలింస్‌ నిర్మిస్తున్న ‘ఔరంగజేబ్‌’ సినిమాలో నటించే అవకాశం వచ్చింది. అప్పటికే దర్శకుడు మోహిత్‌ దర్శకత్వంలోవచ్చిన ‘ఆషికి-2’ సినిమాకి శ్రద్ధ ఓకే చెప్పింది. దాంతో ఔరంగజేబ్‌ సినిమాని వదులుకుంది. ఇది ఒకందుకు శ్రద్ధకు మేలే చేసింది. ఎందుకంటే ‘ఔరంగజేబ్‌’ సినిమా బాక్సాఫీస్‌ వద్ద కుప్పకూలిపోతే ‘ఆషికి-2’ బ్లాక్‌బస్టర్‌ హిట్‌గా నిలిచింది. అంతేకాదు దాదాపు ఏడు జాతీయ అవార్డులు ఈ సినిమా కైవశం చేసుకుంది. ఆ తర్వాత వరుసగా ‘ఏక్‌ విలన్‌’, ‘హైదర్‌’, ‘బాఘి’, ‘ఏబీసీడీ-2’, ‘రాక్‌ఆన్‌-2’ సినిమాలతో వరుస హిట్లు సాధించింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here