హ్యాపీబర్త్‌డే ‘జూనియర్‌ బచ్చన్‌’

0
22

బాలీవుడ్‌ నట దిగ్గజం అమితాబ్‌ బచ్చన్‌, అలనాటి నటి జయబాదురి కుమారుడిగా సినీరంగానికి పరిచయమై.. నటుడిగా, గాయకుడిగా, నిర్మాతగా తనకంటూ గుర్తింపు తెచ్చుకున్నారు అభిషేక్‌ బచ్చన్‌. ఆదివారం అభి తన 41వ పుట్టినరోజు జరుపుకొంటున్నారు. ఈ సందర్భంగా ఆయనకి పుట్టినరోజు శుభాకాంక్షలు చెబుతూ..

అభి చదువంతా ముంబయి, దిల్లీ, స్విట్జర్లాండ్‌, బోస్టన్‌లలో జరిగింది. చిన్నప్పుడు డిస్లెక్సిక్‌తో బాధపడ్డారు. అంటే అసలు చదవడం వచ్చేది కాదు. పెద్దయ్యేకొద్దీ సమస్య తగ్గడంతో ఇప్పుడు అనర్గళంగా చదవగలరు, మాట్లాడగలరు. ‘రెఫ్యూజీ’ చిత్రంతో బాలీవుడ్‌లో అరంగ్రేటం చేశారు. 2000లో వచ్చిన ఈ చిత్రం ఆశించిన విజయాన్ని అందుకోలేకపోయినా.. అభి నటనకు మాత్రం మంచి మార్కులు పడ్డాయి. ఆ తర్వాత మూడేళ్ల పాటు అభి నటిస్తున్న సినిమాలన్నీ వరుసగా ఫ్లాప్‌ అవుతూ వచ్చాయి. కానీ 2004లో వచ్చిన యాక్షన్‌ థ్రిల్లర్‌ చిత్రం ‘ధూమ్‌’ బాక్సాఫీస్‌ వద్ద రికార్డు సృష్టించింది. అక్కడి నుంచి అభి సినీ ప్రయాణం వూపందుకుంది. వరుసగా బంటీ ఔర్‌ బబ్లీ, దస్‌, బ్లఫ్‌ మాస్టర్‌, ధూమ్‌-2, గురు, సర్కార్‌రాజ్‌, దోస్తానా, బోల్‌ బచ్చన్‌, హౌస్‌ఫుల్‌-3, ధూమ్‌-3, న్యూ ఇయర్‌ సినిమాల్లో నటించారు. ఇందులో అభి హీరోగా నటించిన చిత్రాలు కేవలం రెండే. మిగతావన్నీ మల్టీస్టారర్లే. యువ, సర్కార్‌, కభీ అల్విదా నా కెహనా సినిమాలకి గానూ అభికి ఉత్తమ సహాయ నటుడిగా ఫిలింఫేర్‌ అవార్డులు వరించాయి. ఆ తర్వాత 2009లో అభి తండ్రి అమితాబ్‌, విద్యా బాలన్‌తో కలిసి ‘పా’ సినిమాలో నటించారు. ఈ సినిమాకి గానూ అభికి జాతీయ పురస్కారం లభించింది.

అటు సినిమా ఇటు బిజినెస్‌
అభి ఆఖరిగా నటించిన చిత్రం ‘హౌస్‌ఫుల్‌-3’. ఈ సినిమా బాక్సాఫీస్‌ వద్ద మంచి హిట్‌ సాధించింది. ఆ తర్వాత అభి ఇంకే సినిమాలకు సంతకం చేయలేదు. సినిమాలే కాకుండా జూనియర్‌ బచ్చన్‌కి ప్రొకబడ్డీ లీగ్‌లో జైపూర్‌ పింక్‌ పాంథర్స్‌ టీంకి సహ యజమానిగా వ్యవహరిస్తున్నారు. చెన్నయాన్‌ ఎఫ్‌సీలో అభికి ఇండియన్‌ సూపర్‌లీగ్‌లో కొంత వాటా ఉంది.

‘బ్రాండ్‌’ అంబాసిడర్‌
అభి ఎల్‌జీ, అమెరికన్‌ ఎక్స్‌ప్రెస్‌ క్రెడిట్‌ కార్డులు, వీడియోకాన్‌ డీటీహెచ్‌, మోటొరొలా, ఫోర్డ్‌ ఫీస్టా, ఐడియా ఫోన్లకు బ్రాండ్‌ అంబాసిడర్‌గా వ్యవహరిస్తున్నారు. 2009లోఉత్తమ బ్రాండ్‌ అంబాసిడర్‌ ఆఫ్‌ ది ఇయర్‌గా ఎన్డీటీవీ టెక్‌లైఫ్‌ అవార్డు అందుకొన్నారు. టీఏఎమ్‌ మీడియాకి చెందిన యాడ్‌ఎక్స్‌ ఇండియా నిర్వహించిన సర్వేలో 2010 జనవరి నుంచి డిసెంబర్‌ వరకు అత్యధిక బ్రాండ్లను ఎండార్స్‌ చేస్తున్న సెలబ్రెటీల్లో అభి నిలిచారు. 41.5 శాతం యాడ్స్‌లో 4.7 శాతం అభిదే.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here