హోదా కంటే ప్యాకేజీయే మేలు

0
15

ఎన్టీఆర్‌ మనవడిగా పుట్టడం తన పూర్వజన్మ సుకృతమని నారా లోకేశ్‌ అన్నారు. ఎన్టీఆర్‌ స్వగ్రామమైన కృష్ణా జిల్లా నిమ్మకూరులో ఈరోజు నందమూరి బాలకృష్ణతో కలిసి ఆయన పర్యటించారు. ఈ సందర్భంగా గ్రామంలో 30 పడకల ఆస్పత్రి నిర్మాణానికి భూమి పూజ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… బాలయ్య సూచన, ప్రోత్సాహంతోనే తాను నిమ్మకూరు గ్రామాన్ని దత్తత తీసుకున్నట్లు చెప్పారు. బెల్‌ కంపెనీ ఏర్పాటుతో నిమ్మకూరు రూపురేఖలు మారిపోతాయన్నారు.

విభజన తర్వాత రూ.16వేల కోట్ల లోటుతో ఆంధ్రప్రదేశ్‌ ఏర్పడిందని.. ఆ లోటు కనిపించకుండా ముఖ్యమంత్రి చంద్రబాబు అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారని లోకేశ్‌ చెప్పారు. డబ్బుల్లేవని చంద్రబాబు ఏనాడు అభివృద్ధి ఆపలేదన్నారు. ప్రత్యేక హోదా పేరుతో జరుగుతున్న కుట్ర రాజకీయాలను ప్రజలు తిప్పి కొట్టాలని పిలుపునిచ్చారు. హోదాతో వచ్చే లాభాలన్నీ ప్రత్యేక ప్యాకేజీతో వవస్తున్నాయని తెలిపారు. 2017తో ప్రత్యేక హోదా రద్దు చేస్తామని కేంద్ర చెబుతోందని… హోదా ఉన్న రాష్ట్రాలు ఈజ్‌ ఆఫ్‌ డూయింగ్‌ బిజినెస్‌లో చిట్టచివరి స్థానంలో ఉంటున్నాయని తెలిపారు. దేశానికి వస్తున్న పెట్టుబడుల్లో రూపాయికి 16 పైసలు మేర ఆంధ్రప్రదేశ్‌కే వస్తున్నాయని… ప్రత్యేక హోదా ఉన్న రాష్ట్రాలకు 4పైసలు మాత్రమే వస్తున్నాయని లోకేశ్‌ తెలిపారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here