హోదాపై పవన్‌ తప్పుదారి పట్టిస్తున్నారు

0
16

ప్రత్యేక హోదాపై నకిలీ ట్వీట్లు చేస్తూ జనసేన అధ్యక్షుడు పవన కల్యాణ్‌ విద్యార్థులు, యువతను తప్పుదోవ పట్టిస్తున్నారని ఏపీ విద్యార్థి, యువజన జేఏసీ నాయకుడు అడారి కిషోర్‌కుమార్‌ ఆరోపించారు. సోమవారం ఏపీ భవన వద్ద ఆయన మీడియాతో మాట్లాడారు. సమైక్యాంధ్ర ఉద్యమం సందర్భంగా లక్షలాది మంది యువత, విద్యార్థులపై కేసులు పెట్టినప్పుడు ఆయనెందుకు మాట్లాడలేదని ప్రశ్నించారు. తెలంగాణ ఉద్యమకారులకు భయపడి సమైక్య ఉద్యమాన్ని, ఉద్యమంలో పాల్గొన్న ప్రజలను పవన్‌ పట్టించుకోలేదన్నారు. తమిళనాడు తరహాలో ఉద్యమం అంటున్న ఆయన.. తమిళ హీరోల తరహాలో ప్రజల్ని ఎందుకు ఆదుకోవడం లేదని ప్రశ్నించారు.

LEAVE A REPLY