హైస్పీడ్ రైళ్లపై రష్యా బృందం అధ్యయనం

0
39

దేశంలో హైస్పీడ్ రైళ్లను ప్రవేశపెట్టాడానికి రష్యా, భారత రైల్వేల మధ్య ఒప్పందం కుదిరింది. ఇందులో భాగంగా దేశంలోని కొన్ని కీలక రూట్లకు సంబంధించిన కారిడార్ల ఎంపిక జరిగింది. ప్రస్తుతం ఆయా కారిడార్ల పటిష్ఠతపై అధ్యయనం జరుగుతున్నది. ఈ క్రమంలో దక్షిణ మధ్య రైల్వే పరిధిలో నడుస్తున్న రైళ్ల స్పీడ్ వివరాలు, ట్రాక్ పరిస్థితులు, సాంకేతిక సామర్థ్యం, రైల్వే సిబ్బంది, మెటీరియల్ నాణ్యత, రూట్ క్రాసింగులు, బ్రిడ్జీలు, రైలు ఇంజన్లు, కోచ్‌ల పరిస్థితి, తదితర అంశాలపై అధ్యయనం చేయడానికి రష్యా రైల్వే ఉన్నతాధికారి వ్లాదిమియార్ ఫినోవ్ నేతృత్వంలో ఓ బృందం బుధవారం సికింద్రాబాద్‌కు చేరుకున్నది. ఈ బృందం మూడురోజులపాటు దక్షిణ మధ్య రైల్వే అనుసరిస్తున్న విధానాలు, హైస్పీడ్ రైళ్లు ప్రవేశపెట్టడానికి ఎలాంటి చర్యలు చేపట్టాలన్న అంశాలపై సమగ్రంగా నివేదికను రూపొందించి రైల్వే బోర్డుకు నివేదించనున్నది. హైస్పీడ్ రూట్ కారిడార్‌లో భాగంగా సికింద్రాబాద్-నాగ్‌పూర్ మార్గాన్ని ఎంపిక చేసింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here