హైవేలపై వైన్స్ బంద్

0
43

దేశవ్యాప్తంగా హైవేలపై మద్యం దుకాణాలను నిర్వహించకుండా సుప్రీంకోర్టు నిషేధం విధించింది. ప్రస్తుత దుకాణాల లైసెన్సులను వచ్చే మార్చి 31 తర్వాత రెన్యువల్ చేయకూడదని సూచించింది. నేషనల్ హైవేలు, రాష్ర్టాల హైవేల మీద, సమీపంలో మద్యం దుకాణాలు లేకుండా, దుకాణాల సూచిక బోర్డులు లేకుండా చర్యలు తీసుకోవాలని ప్రధాన న్యాయమూర్తి టీఎస్ ఠాకూర్ నేతృత్వంలోని ముగ్గురు సభ్యుల ధర్మాసనం గురువారం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను ఆదేశించింది. రోడ్డు ప్రమాదాల్లో ఏటా లక్షన్నర మంది బలవుతుండటం పట్ల కిందటి వారం తీవ్ర ఆందోళన వ్యక్తం చేసిన అత్యున్నత న్యాయస్థానం.. హైవేలపై మద్యం దుకాణాల మూసివేత, సూచిక బోర్డుల తొలగింపునకు ఆదేశించాల్సి వస్తుందని అప్పుడే పేర్కొంది. రోడ్ల ప క్కన మద్యం దుకాణాలను వివిధ రాష్ర్టాలు తొలగించకపోవడంపై ధర్మాసనం తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here