హైదారాబాద్‌లో శీతాకాల విడిదిని ముగించుకొని ఢిల్లీకి

0
28

హైదారాబాద్‌లో శీతాకాల విడిదిని ముగించుకొని ఢిల్లీకి వెళ్లిన రాష్ట్రపతి ప్రణబ్‌ముఖర్జీకి రాష్ట్ర గవర్నర్, ముఖ్యమంత్రి, పలువురు ప్రముఖులు ఆత్మీయ వీడ్కోలు పలికారు. శనివారం ఉదయం హకీంపేట్ వైమానికదళ విమానాశ్రయం నుంచి ప్రత్యేక విమానంలో రాష్ట్రపతి హస్తినకు బయలుదేరారు. విమానాశ్రయంలో గవర్నర్ నరసింహన్, ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు, కేంద్రమంత్రి బండారు దత్తాత్రేయ, శాసనమండలి చైర్మన్ స్వామిగౌడ్, అసెంబ్లీ స్పీకర్ మధుసూదనాచారి, ఉప ముఖ్యమంత్రులు కడియం శ్రీహరి, మహమూద్ అలీ, మంత్రులు నాయిని నర్సింహారెడ్డి, కేటీ రామారావు, పోచారం శ్రీనివాస్‌రెడ్డి, ఇంద్రకరణ్‌రెడ్డి, జగదీశ్‌రెడ్డి, ఎంపీ వినోద్‌కుమార్ తదితరులు రాష్ట్రపతి ప్రణబ్‌కు పుష్పగుచ్ఛాలు అందజేసి వీడ్కోలు పలికారు. రాష్ట్రపతికి సీఎం కేసీఆర్ జ్ఞాపికను బహూకరించి పాదాభివందనం చేసి ఆశీర్వాదం తీసుకున్నారు. వీడ్కోలు పలికిన వారిలో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ప్రదీప్ చంద్ర, ప్రభుత్వ ప్రధాన సలహాదారు రాజీవ్‌శర్మ, పురపాలక, పరిపాలనా శాఖ కార్యదర్శి నవీన్‌మిట్టల్, డీజీపీ అనురాగ్‌శర్మ తదితరులు ఉన్నారు.

201

LEAVE A REPLY