హైదరాబాద్ లో కరెంట్‌ కొరతలేదు..కోతలెందుకో?

0
22
 ఆదివారం సీతాఫల్‌మండి ఈఆర్‌ఓ పరిధిలో విద్యుత్ సరఫరా నిలిచి పోయింది. టోల్‌ఫ్రీ నెంబర్‌కు ఫోన్‌ చేసినా కలవలేదు. ఆఫీస్‌కు వెళ్తే ఆదివారం సెలవు రేపు రావాలని సమాధానం. 24 గంటలూ అందు బాటులో ఉండాల్సిన విద్యుత్ సిబ్బంది పత్తాలేరు. ఫ్యూజ్‌ ఆఫ్‌కాల్‌ విభాగం సిబ్బంది కార్యాలయాలకు రాకుండానే ఇంటి నుంచి పనులు చక్కబెడుతున్నా రని ఆరోపణలు వస్తున్నాయి.
రాత్రయితే కరెంట్‌ కట్‌!
నగరంలో కొన్ని రోజులుగా రాత్రి వేళల్లో విద్యుత్ అంతరాయాలు పెరుగుతున్నాయి. ఫిర్యాదిచ్చినా సకాలంలో సిబ్బంది స్పందించకపోవడంతో కరెంట్‌ కోతలున్నాయనే అనుమానాలు వస్తున్నాయి. డిమాండ్‌కు సరిపడా విద్యుత్ వుంది.అంతరాయాల నివారణకు కొత్త టెక్నాలజీ అందుబాటులోకి వచ్చింది. క్షేత్రస్థాయి సిబ్బందికీ ట్యాబ్‌లిచ్చి సమస్యలు లేకుండా చూడాలని ఆదేశాలిచ్చారు. అయినా యథా అధికారి..తథా సిబ్బంది చందంగా మారింది పరిస్థితి. అధికారుల పర్యవేక్షణ లేకపోవడంతో సిబ్బంది ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారని ఆరోపణలున్నాయి. రాత్రి కరెంటు పోతే..ఇక వచ్చేది తెల్లవారో, మధ్యాహ్నమో అనే విధంగా విద్యుత సరఫరా వుందని వినియోగదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

LEAVE A REPLY