హైదరాబాద్‌- కాకినాడ టౌన్‌ మధ్య ప్రత్యేక రైళ్లు

0
27

సికింద్రాబాద్‌: ప్రయాణికుల సౌకర్యార్థం గుంటూరు మీదుగా హైదరాబాద్‌-కాకినాడ టౌన్‌ మధ్య రెండు ప్రత్యేక రైళ్లు నడుపు తున్నట్టు దక్షిణమధ్యరైల్వే ముఖ్యప్రజాసంబంధాల అధికారి ఉమా శంకర్‌కుమార్‌ తెలిపారు.హైదరాబాద్‌-కాకినాడ టౌన్‌ స్పెషల్‌ (07005) ఈ నెల 1న సాయంత్రం 6.50గంటలకు బయల్దేరి, సికింద్రాబాద్‌ స్టేషన్‌కు 7.15కి, గుంటూరుకు అర్ధరాత్రి 12.30కి, విజయవాడకు 1.30కి చేరుతుంది. మరుసటి రోజు ఉదయం 5.15కి కాకినాడ టౌన్‌ చేరుతుంది.తిరుగు ప్రయాణంలో… కాకినాడ టౌన్‌-హైదరాబాద్‌ స్పెషల్‌ (07006) 4వ తేదీన సాయంత్రం 6.10గంటలకు బయల్దేరి విజయ వాడకు రాత్రి 9.50కి, గుంటూరుకు రాత్రి 11కి చేరుతుంది. మరుసటి రోజు ఉదయం 4.20కి సికింద్రాబాద్‌, 5.10కి హైదరాబాద్‌ చేరుతుంది.

LEAVE A REPLY