హైదరాబాద్‌లో అర్ధరాత్రి బైక్‌ రేసింగ్‌లు

0
3

పోలీసులు ఎన్ని చర్యలు తీసుకున్నా.. అలా చేయొద్దంటూ అవగాహన వచ్చేందుకు ఎంత ప్రయత్నించినా వృథా అయిపోతుంది. అర్థరాత్రి కాగానే నగరంలో ఏదో ఒక చోట యువకులు చేరుతున్నారు. అనంతరం వారు బైక్‌ రేసింగ్‌లకు పాల్పడుతూ హల్‌చల్ చేస్తున్నారు. తాజాగా కూడా శనివారం రాత్రి జూబ్లీహిల్స్ చెక్‌పోస్టు వద్ద కొందరు యువకులను పోలీసులు అరెస్ట్ చేశారు. బైక్‌ రేసింగ్‌లకు పాల్పడుతుండగా వారిని అరెస్ట్ చేశారు. అనంతరం వారి వద్ద నుంచి బైక్‌లు స్వాధీనం చేసుకున్నారు. ప్రస్తుతం పోలీసుల అదుపులో 15 మంది యువకులు ఉన్నారు.

LEAVE A REPLY