హెల్మెట్ లేకుండా రోడ్లపై ప్రయాణించే వాహనదారులను పట్టుకుని ట్రాఫిక్ పోలీసులు ఏం చేస్తారు

0
15

నాసిక్: హెల్మెట్ లేకుండా రోడ్లపై ప్రయాణించే వాహనదారులను పట్టుకుని ట్రాఫిక్ పోలీసులు ఏం చేస్తారు. సదరు వాహనదారుడికి జరిమానా వేసి వదిలేస్తారు. కానీ, మహారాష్ట్రలోని నాసిక్ పోలీసులు అందుకు భిన్నంగా శిక్షను అమలు చేస్తున్నారు. హెల్మెట్ లేకుండా రోడ్లపై ప్రయాణించే వాహనదారులకు జరిమానా వేయకుండా హెల్మెట్ ధరిస్తే కలిగే లాభాలను వివరిస్తూ ఒక వ్యాసం రాయాలని కొత్త నిబంధనను అమలు చేస్తున్నారు. ఇటీవల ముంబైలోని నాకా సమీపంలో హెల్మెట్ లేకుండా 1100 మంది వాహనదారులు ట్రాఫిక్ పోలీసులకు పట్టుబడ్డారు. వారికి జరిమానా విధించకుండా, హెల్మెట్ ధరించడం వల్ల రోడ్డు ప్రమాదాలను ఎలా అరికట్టవచ్చో ఒక వ్యాసాన్ని రాయాలని ముంబై ట్రాఫిక్ పోలీస్ కమిషనర్ జయంత్ బజ్‌బాలే ఆదేశించారు. అందులో 12 మంది వాహనదారులు జరిమానా చెల్లించగా, 194 మంది మాత్రం హెల్మెట్లను కొనుగోలు చేశారు. హెల్మెట్ లేకుండా పట్టుబడిన వారిలో వైద్యులు, లాయర్లు, విద్యార్థులు, ఇంజినీర్లు అధికంగా ఉన్నారు. నాసిక్ ట్రాఫిక్ పోలీసులు అమలు చేస్తున్న ఈ కొత్త విధానాన్ని పలువురు వాహనదారులు అభినందిస్తున్నారు

LEAVE A REPLY