హెచ్‌సీయూ వీసీకి మిలీనియం ప్లాక్స్‌ అవార్డు

0
13

ప్లాంట్‌ సైన్స్‌ విభాగానికి చేసిన సేవలకు, పరిశోధనలకు గుర్తింపుగా మంగళవారం తిరుపతిలో జరిగిన ఇండియన్‌ సైన్స్‌ కాంగ్రెస్‌ అసోసియేషన్‌(ఐఎ్‌ససీఎ) వార్షిక సమావేశంలో హైదరాబాద్‌ సెంట్రల్‌యూనివర్సిటీ వైస్‌చాన్సులర్‌ ప్రొఫెసర్‌ పొదిలే అప్పారావు మిలీనియం ప్లాక్స్‌ అవార్డు అందుకున్నారు. గవర్నర్‌ నర్సింహన్‌, ఏపీ సీఎం చంద్రబాబునాయుడు, కేంద్ర మంత్రులు హర్షవర్ధన్‌, సృజనాచౌదరి సమక్షంలో వీసీ అప్పారావు ఈ అవార్డును ప్రధాని మోదీ చేతుల మీదుగా అందుకున్నారు. ప్రొఫెసర్‌ అప్పారావు బయోఏజంట్స్‌ అగ్రకల్చర్‌ టాస్క్‌ఫోర్స్‌ కమిటీలో సభ్యుడిగా, పొగ్రాం అడ్వైజరీ కమిటీలో సభ్యుడిగా పని చేస్తున్నారు. ప్రతిష్ఠాత్మక అవార్డును అందుకున్న వీసీ అప్పారావును ఫ్యాకల్టీ సభ్యులు అభినందించారు. ఈ సందర్భం గా వీసీ అప్పారావు మాట్లాడుతూ ప్రతిష్ఠాత్మక అవార్డును ప్రధాని చేతుల మీదుగా అందుకోవడం గర్వంగా ఉందన్నారు.

LEAVE A REPLY