హెచ్‌సీఏ అధ్యక్షుడిగా నరేందర్‌

0
17

హైదరాబాద్‌ క్రికెట్‌ సంఘం (హెచ్‌సీఏ) తాత్కాలిక అధ్యక్షుడిగా సీనియర్‌ ఉపాధ్యక్షుడు నరేందర్‌ గౌడ్‌ నామినేట్‌ అయ్యాడు. శనివారం జరిగిన హెచ్‌సీఏ ఎగ్జిక్యూటివ్‌ కమిటీ (ఈసీ) సమావేశంలో నరేందర్‌ను ఏకగ్రీవంగా నామినేట్‌ చేసినట్టు సంఘం కార్యదర్శి జాన్‌ మనోజ్‌ ప్రకటించాడు. సుప్రీంకోర్టు ఆదేశాల నేపథ్యంలో హెచ్‌సీఏ అధ్యక్షుడు అర్షద్‌ అయూబ్‌ పదవికి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. అత్యున్నత నాయస్థానం సూచనల మేరకు సీనియర్‌ ఉపాధ్యక్షుడైన నరేందర్‌ను చీఫ్‌గా ఎంచుకున్నట్టు మనోజ్‌ తెలిపాడు. ఇక, లోధా సిఫారసుల ఎఫెక్ట్‌తో అయూబ్‌తో పాటు ఉపాధ్యక్షులు యాదగిరి, మొయిజుద్దీన్‌, ఈసీ సభ్యులు శ్రీనివాస్‌ రెడ్డి, అమల్‌రాజ్‌ కూడా పదవుల నుంచి తప్పుకున్నారు. సంఘం చీఫ్‌గా ఎంపికైనందుకు నరేందర్‌ ఆనందం వ్యక్తం చేశాడు. సుప్రీం, బోర్డు తదుపరి మార్గదర్శకాలు ఇచ్చేంతవరకూ తాత్కాలిక అధ్యక్షుడిగా కొనసాగుతానని చెప్పాడు

LEAVE A REPLY