హీరో మహేష్‌బాబు, దర్శకుడు శివలకు హైకోర్టులో వూరట

0
12

సినీ కథానాయకుడు మహేష్‌బాబు, దర్శకుడు కొరటాల శివలకు హైకోర్టులో వూరట లభించింది. ‘శ్రీమంతుడు’ సినిమా కాపీరైట్‌ వివాదంపై దాఖలైన పిటిషన్‌ను స్వీకరించిన నాంపల్లిలోని మొదటి అదనపు చీఫ్‌ మెట్రోపాలిటన్‌ మెజిస్ట్రేట్‌ కోర్టు.. వారిద్దరికీ సమన్లు జారీచేస్తూ ఇచ్చిన ఉత్తర్వుల అమలును ఉమ్మడి హైకోర్టు నిలిపివేసింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్‌ ఎ.శంకరనారాయణ గురువారం ఉత్తర్వులిచ్చారు. 2012లో స్వాతి మాసపత్రికలో తాను ‘చచ్చేంత ప్రేమ’ అనే నవలను రాశాననీ, దానిని కాపీచేసి శ్రీమంతుడు సినిమాగా మలిచారని ఆరోపిస్తూ, హైదరాబాద్‌కు చెందిన రచయిత ఆర్‌.డి.విల్సన్‌ అలియాస్‌ శరత్‌చంద్ర నాంపల్లి క్రిమినల్‌ కోర్టును ఆశ్రయించారు. కాపీరైట్‌ చట్టం, భారత శిక్షా స్మృతి కింద వారిపై కేసు నమోదుచేసి, విచారణ జరపాలని కోరారు. దీనిపై విచారణ జరిపిన మొదటి అదనపు చీఫ్‌ మెట్రోపాలిటన్‌ మెజిస్ట్రేట్‌ కోర్టు, ఈ ఏడాది జనవరి 24న మహేష్‌బాబు, శివలకు విచారణకు హాజరుకావాలంటూ సమన్లు జారీచేసింది. ఈ ఉత్తర్వులను సవాలుచేస్తూ మహేష్‌బాబు ఎంటర్‌టైన్‌మెంట్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌, కొరటాల శివ హైకోర్టును ఆశ్రయించారు.

LEAVE A REPLY