హిందూపురంలో కొంటేనే నీళ్లు.. ఏటా రూ.112 కోట్ల వ్యాపారం

0
15

‘‘మాది చిన్నకుటుంబం. నలుగురు సభ్యులమున్నాం. ఇంటి అవసరాలకోసం వారానికి ఒకట్యాంకు రూ. 500 పెట్టి కొనుక్కుంటున్నాం. అవి పది రోజులొస్తున్నాయి. ఏమైనానెలకు మూడు ట్యాంకర్‌లు తెప్పించుకొంటున్నాం. అవి స్నానాలు, బట్టలు ఉతుక్కోవడం, కాలకృత్యాలకు పోతాయి. ఇక వంటకోసం రోజూ రెండు బిందెలు తీసుకొంటాం. బిందె రూ. 5 లెక్కన రూ.10.. క్యానకు 15. ఎలాచూపినా, రోజుకు రూ.75 చొప్పున నెలకు రూ. 2,350 నీళ్లకే పోస్తున్నాం. నా భర్త రూ. 10వేల మామూలు జీతగాడు. ఇంత తక్కువ ఆదాయంలోంచి అంత ఎలా పెట్టగలం? పిల్లలకు సరిగా తిండికూడా పెట్టుకోలేకపోతున్నాం’’ అని అమ్మాజమ్మ వాపోయింది. ఆమె లెక్క ఎంత కరెక్టు అనేది తెలియాలంటే.. అనంతపురం జిల్లా హిందూపురం పట్టణ శివార్లలో పంట బోర్ల దగ్గర బారులుతీరిన ట్యాంకర్లను పరిశీలించాల్సిందే.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here